Laddu Auction: గణేష్ లడ్డును వేలంలో రూ.1.2 లక్షలకు దక్కించుకున్న ముస్లిం యువకుడు
వినాయక ప్రసాదం లడ్డును రూ.1.2 లక్షలకు వేలంలో దక్కించుకొని వార్తలు నిలిచాడు మహాలక్ష్మీవాడకు చెందిన ముస్లిం యువకుడు షేక్ ఆసిఫ్
- By Sudheer Published Date - 09:08 PM, Thu - 28 September 23

హిందూ-ముస్లిం భాయి భాయి అని మరోసారి నిరూపించాడు ఓ ముస్లిం యువకుడు. వినాయకుడి వద్ద నవరాత్రులు పూజలు అందుకున్న వినాయక ప్రసాదం లడ్డును రూ.1.2 లక్షలకు వేలంలో దక్కించుకొని వార్తలు నిలిచాడు మహాలక్ష్మీవాడకు చెందిన ముస్లిం యువకుడు షేక్ ఆసిఫ్. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే వినాయకుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే నవరాత్రులపాటు పూజలందుకున్న గణేశుడి చేతిలో ని లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. నిమజ్జనం రోజు వేలం పాటలో పాల్గొని మరి చేజిక్కించుకుంటారు.
తాజాగా ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మీవాడకు చెందిన ముస్లిం యువకుడు షేక్ ఆసిఫ్ రూ.1.2 లక్షలకు దక్కించుకున్నాడు. జనతా గణేష్ మండల్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన 48 అడుగుల భారీ గణపతి మండపం వద్ద 21 కేజీల లడ్డుని గురువారం (సెప్టెంబరు 28) వేలం వేశారు. ఈ 21 కేజీల లడ్డూని దక్కించుకునేందుకు ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ వేలంపాట హోరాహోరీగా సాగింది. రూ.5 వేల నుంచి ఈ వేలం ప్రారంభం అయింది. చివరకు షేక్ ఆసిఫ్ రూ.1.2 లక్షలకు దక్కించుకున్నాడు. అనంతరం యువకుడిని మండప సభ్యులు శాలువతో సన్మానించారు.
ఇక వినాయకుడి లడ్డు వేలం పాట అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరికి బాలాపూర్ లడ్డు వేలం గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రతి ఏడూ లక్షల్లో పెట్టి లడ్డును దక్కించుకుంటారు. ఈ ఏడాది (2023 ) బాలాపూర్ లడ్డు ను దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలకు దక్కించుకున్నారు. ఇది బాలాపూర్ లడ్డు వేలంలో రికార్డు ధర గా చెప్పాలి. గత ఏడాది రూ.24.60 లక్షల రికార్డు ధర కు పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు.
Read Also : Big Shock to BRS Party : ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న బిఆర్ఎస్ కీలక నేతలు