Aarogyasri : అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ – నెట్వర్క్ ఆస్పత్రులు
Aarogyasri : ఈ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు పొందుతున్న వేలాది మంది రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందకుండా పోతుంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి, బకాయిలను చెల్లించి
- By Sudheer Published Date - 10:03 AM, Sun - 31 August 25

తెలంగాణ రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులు ఈ రోజు అర్ధరాత్రి నుండి ఆరోగ్య శ్రీ (Aarogyasri ) సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ప్రభుత్వానికి ఆరోగ్య శ్రీ పథకం కింద చెల్లించాల్సిన రూ.1300 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. బకాయిలను వెంటనే చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవలను నిలిపివేస్తామని ఇప్పటికే ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ, ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి.
“Trump Is Dead” : ట్రంప్ మరణ వార్తలపై వైట్ హౌస్ క్లారిటీ
ఈ బకాయిల కారణంగా చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నిధులు లేకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని, ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల కొన్ని ఆసుపత్రులు మూసివేసే పరిస్థితి కూడా ఏర్పడిందని వారు చెబుతున్నారు.
ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు పొందుతున్న వేలాది మంది రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందకుండా పోతుంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి, బకాయిలను చెల్లించి, ప్రజలకు వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు, రోగుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.