HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >A Short Film On Kavitha Party Ranks Are Being Sacrificed

Kavitha Birthday Special : కవితపై షార్ట్ ఫిలిం..ఫిదా అవుతున్న పార్టీ శ్రేణులు

Kavitha Birthday Special : నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్న గౌడ్, మట్టు చౌదరి కలిసి ఒక ప్రత్యేక షార్ట్ ఫిలిం ను రూపొందించారు

  • Author : Sudheer Date : 12-03-2025 - 9:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha Birthday
Kavitha Birthday

Kavitha Birthday Special : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం (Kavitha Birthday 2025) సందర్భంగా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్న గౌడ్, మట్టు చౌదరి కలిసి ఒక ప్రత్యేక షార్ట్ ఫిలిం ను రూపొందించారు. నాలుగు నిమిషాల నిడివి గల ఈ ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునేలా రూపొందించబడింది. ప్రత్యేకంగా దక్షిణ కన్నడ జిల్లాలో చిత్రీకరించిన ఈ వీడియోలో ప్రకృతి సోయగాలు, నదులు, సెలయేరులు, పడవ విన్యాసాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియాలో ఈ లఘుచిత్రం విపరీతంగా వైరల్ అవుతూ, పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది.

Fact Check : తెలంగాణలోని ఆ ఆలయం నుంచి కాశీకి భూగర్భ మార్గం ?

“హ్యాపీ బర్త్‌డే కవితక్క” (Happy birthday Kavitakka) అనే శీర్షికతో విడుదలైన ఈ వీడియోలో గులాబీ జెండాలను ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల మధ్య రెపరెపలాడించటం విశేషం. ప్రతి సీన్ ఎంతో జాగ్రత్తగా, ఆకర్షణీయంగా చిత్రీకరించబడింది. కవితకు అభిమానంగా, ఆమె నాయకత్వాన్ని ప్రశంసిస్తూ రూపొందించిన ఈ లఘుచిత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచింది. కేవలం జన్మదిన శుభాకాంక్షలకే కాకుండా, పార్టీ ఆవేశాన్ని, ఐక్యతను, కవిత సేవలను ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ వీడియో రూపొందించినట్లు నాయకులు తెలిపారు.

Syed Abid Ali: భారత క్రికెట్‌లో విషాదం.. దిగ్గజ ఆల్ రౌండర్ కన్నుమూత‌

ఈ లఘుచిత్రాన్ని బుధవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు మేడే రాజీవ్ సాగర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ముఠా జయసింహ తదితరులు హాజరై లఘుచిత్రాన్ని అభినందించారు. ప్రదర్శన అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేక వీడియో కేవలం ఒక లఘుచిత్రంగా కాకుండా, కవిత నాయకత్వాన్ని మరోసారి ప్రజల్లో చాటిచెప్పే ఓ గొప్ప కార్యక్రమంగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Kavitha Birthday short film
  • Kavitha Birthday Special
  • Kavitha Birthday Special videos

Related News

    Latest News

    • DA Hike : ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కారు గుడ్ న్యూస్

    • Crime : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి కొడుకును హత్యచేసిన ప్రియుడు

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

    • Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

    Trending News

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

      • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

      • నేటి బంగారం ధ‌ర‌లివే.. పెరిగాయా? త‌గ్గాయా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd