HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >A New Telangana Talent In Pushpa Movie

Folk Singer Mounika : ఈ అమ్మాయి పాడితే.. పుష్పరాజ్ ఊగిపోవాల్సిందే..!

తెలంగాణ అంటేనే కవులు.. కళాకారులకు పుట్టినిల్లు. ముఖ్యంగా జానపదాలు తమదైన స్టయిల్ పాడే సింగర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటివాళ్లలో ముందుంటారు సింగర్ మౌనిక యాదవ్.

  • Author : Balu J Date : 01-11-2021 - 5:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

తెలంగాణ అంటేనే కవులు.. కళాకారులకు పుట్టినిల్లు. ముఖ్యంగా జానపదాలు తమదైన స్టయిల్ పాడే సింగర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటివాళ్లలో ముందుంటారు సింగర్ మౌనిక యాదవ్. ఈమెది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని కానిపర్తి గ్రామం. పెరిగింది గోదావరిఖని. జమ్మికుంటలో టెన్త్, డిగ్రీ పూర్తిచేసింది. మౌనిక యాదవ్ మంచి డాన్సర్ కూడా. ఆమె అక్క కూడా మంచి సింగర్. స్కూల్ డేస్ నుంచే తల్లిదండ్రులు, టీచర్లు వీరిని ఆటపాటల్లో ప్రోత్సహించారు. ఫోక్ రైటర్స్ స్పూర్తితో పాటలనే ఊపిరిగా బతికేది. తెలంగాణ ఉద్యమంలో మౌనిక యాదవ్ పాడిన పాటలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.  దానికి కారణం..  జనపదాలు ఈ అమ్మాయి గొంతులో ఇట్టే ప్రాణం పోసుకుంటాయి. గోదావరి గలగలల మాదరిగా ఆమె నోటి నుంచి జనపదాలు అలా జాలువారుతుంటాయి.

ఇప్పటివరకు మౌనిక 20కుపైగా బతుకమ్మ పాటలను పాడారు. ఈమె పాడటమే కాకుండా.. బతుకమ్మ ఆల్బమ్స్ లోనూ నటిస్తుంది కూడా. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతి ఏడాది ఓ కొత్త పాటను తెలంగాణ ప్రజలకు అందిస్తుంది మౌనిక. మౌనిక యాదవ్ పాడిన జానపద పాటలు, డీజే పాటలు యూట్యూబ్ లో లక్షలు, మిలియన్లలో వ్యూస్ సంపాదించాయి. దీంతో సింగింగ్ నే కెరీర్ గా సెలెక్ట్ చేసుకుంది. ఇప్పటివరకు మౌనిక పాడిన పాటల్లో ‘పూత పులన్నీ పూసే’,  ‘నగిరే నాగ నందనో’ లాంటి పాటలు హైలైట్ గా నిలిచాయి.

జనపదాలు మౌనిక గొంతులో చక్కగా పలకడంతో పలువురు సంగీత దర్శకులు పాడించాలనుకున్నారు. అయితే మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మౌనిక టాలెంట్ గుర్తించి అవకాశం ఇచ్చాడు. పుష్ప మూవీలో ‘‘నువ్ అమ్మీ.. అమ్మీ అంటుంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ .. సామీ’’ అనే పాటతో మెస్మరైజ్ చేసింది మౌనిక. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. వేలకొద్ది లైక్స్ తో ట్రెండింగ్ లో నిలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • folk
  • pupsha movie
  • singer mounika
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd