Diwali Special Trains : దీపావళి స్పెషల్ ట్రైన్స్.. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచేవి ఇవే
Diwali Special Trains : దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 90 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
- By Pasha Published Date - 08:37 AM, Sat - 11 November 23

Diwali Special Trains : దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 90 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ రైళ్ల రాకపోకలకు సంబంధించిన తేదీలు, స్టేషన్ల వివరాలతో చార్ట్‌లను విడుదల చేసింది. 90 ప్రత్యేక రైళ్లన్నీ నవంబరు 9 నుంచి 30 వరకు షెడ్యూల్ చేసిన తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, నాందేడ్ మీదుగా సికింద్రాబాద్ నుంచి రక్సౌల్ మధ్య నాలుగు జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి బిహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో ఉన్న రక్సౌల్ వరకూ ఇవి రాకపోకలు సాగిస్తాయి.
We’re now on WhatsApp. Click to Join.
జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లలో 22 అన్ రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. వీటిలో దాదాపు 2400 మందికి సీటింగ్ సదుపాయం కల్పించవచ్చు. ఇతర ప్రయాణ సాధనాలతో పోలిస్తే వీటిలో ఛార్జీలు చాలా తక్కువ. నాలుగు జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు ఈ నెల 12, 14, 19, 21 తేదీలలో రాకపోకలు(Diwali Special Trains) సాగిస్తాయి.
SCR runs #SpecialTrains during #FestivalSpecials #Diwali #ChatPuja pic.twitter.com/F6hFCd1ZyO
— South Central Railway (@SCRailwayIndia) November 9, 2023