Financial Uncertainty : రాబోయే ఐదేళ్ల ఫైనాన్షియల్ ప్లానింగ్.. సర్వేలో హైదరాబాదీలు ఏం చెప్పారంటే..
భవిష్యత్ ఆర్థిక సవాళ్ల కోసం వాళ్లు ఎంతమేర సంసిద్ధంగా ఉన్నారు ?
- By Pasha Published Date - 10:14 AM, Thu - 5 September 24
Financial Uncertainty : దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి ? భవిష్యత్ ఆర్థిక సవాళ్ల కోసం వాళ్లు ఎంతమేర సంసిద్ధంగా ఉన్నారు ? అనేది తెలుసుకునేందుకు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) కంపెనీ అనిశ్చిత్ ఇండెక్స్ 2024 పేరిట సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 7,978 మంది అభిప్రాయాలను సేకరించింది. ఇందులో ఆసక్తికర విషయాలను గుర్తించారు. ప్రత్యేకించి ఈ సర్వేలో పాల్గొన్న హైదరాబాదీలు ముఖ్యమైన సమాధానాలు చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
సర్వేలో దేశ ప్రజలు ఏం చెప్పారు ?
- రాబోయే ఐదేళ్లలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు(Financial Uncertainty) ఎదురయ్యే ముప్పు ఉందని సర్వేలో పాల్గొన్న 88 శాతం మంది దేశ ప్రజలు తెలిపారు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమన్నారు.
- వచ్చే ఐదేళ్లలో జాబ్ పోవచ్చనే భయంలో 35 శాతం మంది ఉన్నారు.
- కొత్త టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల జాబ్స్ పోవచ్చని 33.95 శాతం మంది భయపడుతున్నారు.
- ఆర్థిక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామని 76.57 శాతం మంది తెలిపారు.
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సేవింగ్స్ అకౌంట్‌ను మెయింటైన్ చేస్తున్నామని 70 శాతం మంది చెప్పారు.
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 49 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారు.
- తాము ఎలాంటి పైనాన్షియల్ ప్లానింగ్ చేయలేదని 34.87 శాతం మంది సర్వేలో చెప్పడం గమనార్హం.
- పిల్లల చదువుల కోసం ఫండ్స్ రెడీగా ఉంచుకోవాలని 42.24 శాతం మంది మహిళలు, 38.13 శాతం మంది పురుషులు చెప్పారు.
- 40 శాతం మంది రిస్క్ ఎక్కువున్నా రిటర్న్ ఎక్కువ వచ్చే విభాగాలలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
- 72 శాతం మంది గోల్డ్, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడి పెడతామన్నారు.
- షార్ట్ టెర్మ్ లాభాల కంటే లాంగ్‌టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మొగ్గుచూపుతామని సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది తెలిపారు.
Also Read :Maoists Encounter : భద్రాద్రి అడవుల్లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
సర్వేలో హైదరాబాదీలు ఏం చెప్పారు ?
- వచ్చే ఐదేళ్ల ఆర్థిక అనిశ్చితి ఎదురైనా భవిష్యత్తుకు భరోసా కల్పించేలా సిద్ధంగా ఉన్నామని 95 శాతం మంది హైదరాబాదీలు చెప్పారు.
- భవిష్యత్తు ఆర్థిక సవాళ్ల నుంచి ఫ్యామిలీని కాపాడేందుకు బీమా పాలసీలు తీసుకున్నామని 83 శాతం మంది నగరవాసులు తెలిపారు.
- తాము మ్యూచువల్ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు పెడుతున్నామని 10 శాతం మంది పేర్కొన్నారు.
- హైదరాబాద్ వాసుల్లో 48 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
- హెల్త్ లేదా యాక్సిడెంటర్ ఎమర్జెన్సీ ఎదురైతే వాడుకునేందుకు హైదరాబాద్ వాసుల్లో దాదాపు 69 శాతం మంది సేవింగ్స్ అకౌంటులో డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు.