Heart Attack : నిజామాబాద్‌లో గుండెపోటుతో ఏడోతరగతి విద్యార్థి మృతి
నిజామాబాద్‌లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని దసరా సెలవులకు ఇంటికి వచ్చి గుండెపోటు తో మరణించడం ఆ కుటుంబంలో విషాదం నింపింది
- By Sudheer Published Date - 12:12 PM, Sun - 15 October 23

ఇటీవల కాలంలో గుండెపోటు (Heart Attack) అనేది వయసు తో సంబంధం లేకుండా వస్తుంది. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్ద వారి వరకు వస్తుంది. అప్పటివరకు సంతోషంగా మన మధ్య ఉన్న వారు..సడెన్ గా గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా కరోనా (Corona) తర్వాత ఈ గుండెపోటు లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఎంతోమంది గుండెపోటుతో మరణించగా..తాజాగా నిజామాబాద్ (Nizamabad)లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి (7th Class Student)ని దసరా సెలవులకు ఇంటికి వచ్చి గుండెపోటు తో మరణించడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.
We’re now on WhatsApp. Click to Join.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కంజర గ్రామానికి చెందిన అదరంగి మైథిలి (Maithili ) ఏడో తరగతి చదువుతోంది. ఆమె అక్క గ్రేసీ కూడా అక్కడే ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. దసరా సెలవుల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి చాతీలో నొప్పిగా ఉందని మైథిలి తల్లికి చెప్పింది. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే బాలిక మరణించినట్టు నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.
Read Also : Durgamata Mandapam Removed : సీఎం జగన్ సభకు అడ్డుగా ఉందని దుర్గామాత మండపాన్ని తొలగించిన అధికారులు