Teachers Shortage: కేసీఆర్ సారూ.. చదువులు సాగెదేలా!
బంగారు తెలంగాణలో ప్రభుత్వ బడులు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
- By hashtagu Published Date - 05:21 PM, Tue - 22 November 22
బంగారు తెలంగాణలో ప్రభుత్వ బడులు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికే సగానికిపై పాఠశాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మరో అంశం ప్రభుత్వ బడులను వేధిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా 64% ఉపాధ్యాయుల కొరతను ఉన్నట్టు తెలుస్తోంది. ఇది రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది. తెలంగాణ పౌర స్పందన వేదిక నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 1639 పాఠశాలలను సర్వే చేయగా 1043 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు నివేదించారు.
సెకండరీ గ్రేడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లతోపాటు దాదాపు 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్వే వెల్లడించింది. వివిధ కార్యక్రమాల కింద చేపట్టిన అభివృద్ధి పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఎమ్మెల్సీ, తెలంగాణ పౌర స్పందన వేదిక అధ్యక్షురాలు ఎ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. తాత్కాలిక ఉపాధ్యాయులను తక్షణమే నియమించి, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దాదాపు అన్ని పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి బదిలీలు, పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయని ఫెడరేషన్ చెబుతోంది. సర్వే చేసిన పాఠశాలల్లో మొత్తం 498 సెకండరీ గ్రేడ్ టీచర్ల కొరత ఉన్నట్లు తేలింది. గణితం, జీవ శాస్త్రం, ఇతర సబ్జెక్టులకు ఉపాధ్యాయులు అవసరం. నవంబర్ 1 నుంచి 15వ తేదీ మధ్య సర్వే నిర్వహించగా.. సర్వేలో పాల్గొన్న 47% పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సొంత ఖర్చులతో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తేలింది.
Related News
Kishan Reddy : ప్రజలకు వెన్నుపోటు పొడవటమే ఇందిరమ్మ రాజ్యమా?: కిషన్ రెడ్డి
Kishan Reddy: రైతుల(Farmers) పట్ల రాష్ట్ర ప్రభుత్వ(State Govt) తీరును నిరసిస్తూ బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) దీక్ష చేపట్టారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్ష(Diksha)కు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కిషన్రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయ�