6 IAS Transferred in Telangana : తెలంగాణలో పలువురు IASల బదిలీ
- Author : Sudheer
Date : 24-01-2024 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..వరుసగా IASలను బదిలీ చేస్తూ వస్తుంది. గత ప్రభుత్వం బిఆర్ఎస్ (BRS) లో పలు శాఖల్లో విధులు నిర్వహించిన అధికారులను బదిలీ చేయడం..శాఖల మార్పులు చేయడం చేస్తూ వస్తుంది కొత్త ప్రభుత్వం. ఈ తరుణంలో ఈరోజు ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్, పశుసంవర్ధకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌కుమార్, వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శిగా టీ వినయ్‌కృష్ణారెడ్డిని నియమించింది. రోడ్లు భవనాలశాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్, టీఎస్‌ఐఆర్‌డీ సీఈవోగా పీ కాత్యాయనిదేవి, గనులశాఖ డైరెక్టర్‌గా సుశీల్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.
Read Also :Kurchi Tata : కుర్చీ తాత ఫై శృంగార నటి పిర్యాదు..అదుపులోకి తీసుకున్న పోలీసులు