6 Guarantee Application Form : ట్రంకు పెట్టెల్లో ప్రజాపాలన అప్లికేషన్లు..
- By Sudheer Published Date - 12:48 PM, Sat - 30 December 23

తెలంగాణాలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ప్రస్తుతం ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ద్వారా ఆరు పథకాలకు (6 Guarantees) సంబదించిన దరఖాస్తులను (Application Form) స్వీకరిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేంద్రాల బాట పడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజు గురువారం 7.46 లక్షల దరఖాస్తులు రాగా, రెండో రోజైన శుక్రవారం 8.12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇవే కాకుండా గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. జీహెచ్‌ఎంసీతోపాటు నగర, పట్టణ ప్రాంతాల్లో 4,89,000 దరఖాస్తులు వచ్చాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి 3,23,862 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.
ఇక కోటి ఆశలతో నిరుపేదలు ‘కాంగ్రెస్ గ్యారెంటీ’ల కోసం చేసుకుంటున్న దరఖాస్తులను ట్రంకు పెట్టెల్లో భద్రపరుస్తున్నారు. ఈ మేరకు పురపాలికలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఒక ట్రంకు పెట్టెకు రూ.1,800 చొప్పున కొనుగోలుచేసి దరఖాస్తులన్నీ వాటిలో భద్రపరచాలని సూచించారు. దీంతో ప్రస్తుతం అధికారులు ట్రంకు పెట్టెల కొనుగోళ్లపై దృష్టి సారించారు.
Read Also : New RTC Buses Inaugurate : కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం..