తగ్గుతున్న కరోనా.. తెలంగాణలో తాజా కేసులు 218
జనాలను ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి క్రమక్రమంగా తగ్గుతోంది. రోజురోజుకూ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో తెలంగాణ ప్రజలు హాయిగా ఊపీరిపీల్చుకుంటున్నారు.
- By Balu J Published Date - 12:30 PM, Wed - 6 October 21

జనాలను ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి క్రమక్రమంగా తగ్గుతోంది. రోజురోజుకూ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో తెలంగాణ ప్రజలు హాయిగా ఊపీరిపీల్చుకుంటున్నారు. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం.. మరోవైపు ప్రజలు రెండు డోసులను కంప్లీట్ చేసుకోవడంతో కొవిడ్ అదుపులోకి వచ్చింది. తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 46,578 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 218 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, కరీంనగర్ జిల్లాలో 14, నల్గొండ జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 248 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,66,971 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,58,657 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,390 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,924కి పెరిగింది.
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకవేళ థర్డ్ వేవ్ తీవ్రరూపం దాల్చితే.. అందుకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. కరోనా నివారణలో టీకా పనితీరు బాగా ఉండటంతో.. ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకునేలా చర్యలు తీసుకుంటోంది.
Related News

Vibrio Vulnificus : అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న మరో బ్యాక్టీరియా.. 13 మంది మృతి
ప్రతి సంవత్సరం సుమారు 200 మంది అమెరికన్లు విబ్రియో వల్నిఫికస్ బారిన పడుతుండగా.. కనీసం ఐదుగురు మరణిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.