HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >%f0%9d%90%83%f0%9d%90%9a%f0%9d%90%a7%f0%9d%90%a0%f0%9d%90%9e%f0%9d%90%ab%f0%9d%90%a8%f0%9d%90%ae%f0%9d%90%ac %f0%9d%90%81%f0%9d%90%a2%f0%9d%90%a4%f0%9d%90%9e %f0%9d%90%92%f0%9d%90%ad%f0%9d%90%ae

Bike Racing: రాయదుర్గం రోడ్ల ఫై డేంజరెస్ స్టంట్స్ ..గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు

ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

  • By Sudheer Published Date - 11:51 AM, Sun - 16 June 24
  • daily-hunt
Bike Ricing
Bike Ricing

హైదరాబాద్ లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రకరకాల స్టంట్లు (Bike Racing) చేస్తూ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు పక్కవారి ప్రాణాలతోనూ చెలగాటం ఆడుతున్నారు. ఇలా పోకిరీలు రద్దీగా ఉండే రహదారులపై కార్లు, బైక్​లతో హల్‌చల్‌​ చేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రేసింగ్‌లు, స్టంట్లు చేస్తున్నారు. అధిక వేగంతో రయ్​రయ్​మంటూ చక్కర్లు కొడుతూ, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కొందరు పోకిరీలు ఇందుకు సంబంధించిన వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు చూసిచూడనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు రాయదుర్గం టీహబ్‌ రోడ్లు, ఐటీ క్షేత్రంలోని రోడ్లు బైకు రేస్‌లు, విన్యాసాలకు అడ్డగా మారుతున్నాయి. హైదరాబాద్‌ నలమూలల నుంచి భారీగా బైకర్లు గుంపులుగా అక్కడికి చేరుకుంటారు. వాహనాలను మెరుపు వేగంతో డ్రైవ్ చేయడమే కాక విన్యాసాలూ చేస్తుంటారు. పోలీసుల నిఘా అంతంత మాత్రంగా ఉండడంతో ఆకతాయిల జోరుకు అడ్డుకట్ట పడడంలేదు. అర్ధరాత్రి జనసంచారం పూర్తిగా తగ్గిపోగానే బైకర్లకు పందేలు కాస్తుంటారు. అలా వారు వేగంగా నడిపే క్రమంలో అదుపు తప్పితే అక్కడి డివైడర్లు, ఫుట్‌పాత్‌లకు తగిలి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఒక్కోసారి ఇతరులకు నష్టం కలుగవచ్చు. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్న వారు మాత్రం ఆపడం లేదు. నిన్న రాత్రి కూడా ఇలాగే పదుల సంఖ్యలో బైకర్లు రేస్ లు చేసారు. అర్ధరాత్రి నుండి ఉదయం వరకు కూడా ఈ రేస్ లు కొనసాగాయి. ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి పోలీస్ వ్యవస్థలో నిర్లక్ష్యం ఎక్కువ అవుతుందని..ఎక్కడ చూసిన నేరాలు పెరిగిపోతున్నాయని బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

𝐑𝐢𝐝𝐞𝐫𝐬’ 𝐏𝐚𝐫𝐚𝐝𝐢𝐬𝐞: 𝐃𝐚𝐧𝐠𝐞𝐫𝐨𝐮𝐬 𝐁𝐢𝐤𝐞 𝐒𝐭𝐮𝐧𝐭𝐬 𝐢𝐧 𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝’𝐬 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐂𝐢𝐭𝐲

Hyderabad’s Knowledge City and T-Hub area have become hot spots for “daredevil” bikers performing dangerous stunts. On Saturday night, Raichur police… pic.twitter.com/tB5toNFq1q

— Sudhakar Udumula (@sudhakarudumula) June 16, 2024

Read Also : Akira Nandan Mamitha Baiju Love Story : అకిరా నందన్ తో మమితా బైజు.. ఈ కాంబో సెట్ అయితే మాత్రం..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bike racing
  • hyderabad
  • Weekend

Related News

Kaveri Travels

Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్

  • Liquor Shop

    Liquor Shop: తెలంగాణ మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగింపు!

  • Kurnool Bus Fire

    Kurnool Bus Fire: క‌ర్నూలులో ఘోర ప్ర‌మాదం.. మంట‌ల్లో కాలిపోయిన బ‌స్సు, వీడియో ఇదే!

  • Gold

    Gold Price : ఒకేసారి రూ.3 వేలకు పైగా తగ్గిన బంగారం ధర

  • Congress

    Congress: కాంగ్రెస్‌తోనే తెలుగు సినీ పరిశ్రమకు స్వర్ణయుగం!

Latest News

  • viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు

  • Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

  • Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

  • AP Rains: ఏపీకి తుపాను ముప్పు.. ఈ జిల్లాల ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ హెచ్చ‌రిక‌!

  • Akhanda 2 : సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో కొ*కా.. బాలయ్య ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్..!

Trending News

    • Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!

    • Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!

    • ఈ 6 రాశుల వారికి అప్పులిస్తే జాగ్రత్త..! తిరిగి డబ్బులు రావడం కష్టమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు

    • Five Habits: మీలో కూడా ఈ ఐదు అలవాట్లు ఉన్నాయోమో చెక్ చేసుకోండి!

    • Virat Kohli: ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ ప‌ట్టు త‌గ్గిపోయిందా? గ‌ణాంకాలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd