HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Zaap I 300electric Bike Released In Market Specification

Zap i300: అద్భుతమైన డిజైన్ తో ఆకట్టుకుంటున్న కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ధర, ఫీచర్స్ ఇవే?

దేశవ్యాప్తంగా రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో నిత్యం పదుల

  • By Anshu Published Date - 07:30 AM, Wed - 22 February 23
  • daily-hunt
Zap I300
Zap I300

దేశవ్యాప్తంగా రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో నిత్యం పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త స్టార్టప్ కంపెనీ న్యూలుక్ ఓ బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అద్భుతమైన లుక్ తో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోందీ ఎలక్ట్రిక్ బైక్. అయితే ఇప్పటివరకు ఎన్నో రకాల ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్ లు విడుదల అయిన తెలిసిందే. కానీ ఇంతవరకు ఏ కంపెనీ కూడా తీసుకోడానికి విధంగా సరికొత్త లుక్ లో ఈ బైక్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ వినియోగదారులు దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

జాప్ ఐ 300 సీసీ బైక్ ఎలక్ట్రిక్ స్టెప్ త్రూ స్కూటర్‌లా కంపెనీ చెబుతుంది. ఈ లండన్, యూకే ఆధారిత సంస్థను 2017లో స్థాపించారు. ఈ బైక్‌ జెడ్ ఆకారంలో ఉంటుంది. ఎస్కోస్కెలిటిన్ ఫ్రేమ్ చుట్టూ స్కూటర్ వంటి స్టెప్ త్రూ డిజైన్‌తో ఉంటుంది. ఈ ఐ 300 బైక్ యాక్సలరేషన్, డైనమిక్స్‌తో బైక్ ప్రియులను ఆకట్టుకుంటోంది అలాగే బ్యాటరీలు లేకుండా ఈ స్కూటర్ బరువు 92 కిలోలుగా ఉండనుంది. ఈ బైక్ తేలికగా ఉన్నా 150 కిలోల లోడ్ పరిమితి ఉంది. అలాగే 14 అంగుళాల చక్రాలతో ఫ్రంట్ ఫోర్క్స్, మార్చుకోదగిన ఫ్రంట్ ఫెండర్, సర్దుబాటు చేయగల పుష్ రోడ్ సస్పెన్షన్ కలిగి ఉంది.

ఈ జాప్ బైక్ 14 కెడబ్ల్యూ పవర్, 587 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే ఐపీఎం ఎలక్ట్రిక్ మోటర్ నుంచి శక్తిని పొందుతుంది. ఇది కార్బన్ ఫైబర్ బెల్ట్ డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తుంది. 2.2 సెకన్లలోనే 30 కిలో మీటర్ల స్పీడ్ అందుకోవడం ఈ బైక్ ప్రత్యేకత. అలాగే 5 సెకన్ల కంటే తక్కువలో 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 720 డబ్ల్యూహెచ్‌ సామర్థ్యంతో రెండు తొలగించగల 72 వీ లిథియం ఐయాన్ బ్యాటరీలతో ఈ బైక్ వస్తుంది. కేవలం 40 నిమిషాల్లోనే 80 శాతం వరకూ చార్జ్ చేసుకునే అవకాశం ఈ బైక్ సొంతం. అయితే ఈ బైక్ ప్రస్తుతం రిజర్వ్‌లో ఉంది. ఎంట్రీ లెవెల్ మోడ్ 7400 డాలర్లుగా కాగా అలాగే పరిమిత లాంచ్ ఎడిషన్ మోడలైతే 10140 డాలర్లుగా కంపెనీ ధర నిర్ణయించింది. ఈ బైక్‌ను నేరుగా జాప్ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడికైనా ఈ బైక్‌ను డెలివర్ చేస్తారు అని తెలిపింది కంపెనీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • electric bike
  • feachers
  • price
  • Zap i300
  • Zap i300 electric bike

Related News

Pova

Pova Mobiles : POVA స్లిమ్ 5G నుంచి స్లిమెస్ట్ ఫోన్.. ధర ఎంత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Pova Mobiles : ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అంటూ టెక్నో కంపెనీ POVA స్లిమ్ 5G ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd