Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై ఒకేసారి వాట్సాప్ ను రెండు వేరే ఫోన్ లతో వాడొచ్చట?
రోజు రోజుకి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ కూడా విని
- By Nakshatra Published Date - 07:00 PM, Mon - 24 July 23
రోజు రోజుకి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ కూడా వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లను తీసుకువస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. నెలకు దాదాపు నాలుగైదు కొత్త కొత్త ఫీచర్ లను తీసుకొస్తోంది వాట్సాప్ సంస్థ.
కాగా మాములుగా వాట్సాప్ బిజినెస్ వచ్చిన తర్వాత ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ అకౌంట్లు వినియోగించడం చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఓకే వాట్సాప్ నంబర్‌తో రెండు ఫోన్ లలో వాడటం ఎలా? అన్నది చాలామందికి తెలియదు. అయితే ఇలా చేయడానికి కేవలం రెండు స్టెప్స్ పాటిస్తే చాలు. మీరు ఒకే నంబర్‌ను రెండు ఫోన్ లలోనూ వాడుకోవచ్చు. రెండు ఫోన్లకు వాట్సాప్ మెసేజ్‌లు వస్తాయి. మన పాత ఫోన్ నుండి కొత్త ఫోన్ మార్చినపుడు బ్యాక్ అప్ లేకుండానే మన మెసేజ్‌లు అన్ని ఇంకో ఫోన్ లో ప్రత్యక్షం అవుతాయి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పవచ్చు.
మొదట మనం పాత ఫోన్ లో వాడిన వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. అలాగే కొత్త మొబైల్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పాత ఫోన్ లోని వాట్సాప్ నుండి సెట్టింగ్స్ కి వెళ్లి linked device అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి. అలాగే కొత్త ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసే సమయంలో link your old device అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు మీరు రెండు అకౌంట్ లలోనూ ఓకే వాట్సాప్ నంబర్ ను వాడుకోవచ్చు. పాత మొబైల్లో ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను కొత్త మొబైల్లో ఉన్న వాట్సాప్‌కు స్కాన్ చేస్తే చాలు. రెండు మొబైల్స్ లోనూ ఓకే నంబర్ తో వాట్సాప్ వాడుకోవచ్చు. మామూలుగా మనం కొత్త ఫోన్ రాగానే అందులో వాట్సాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు పాత నంబర్లో వాట్సాప్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. మనం కొత్త ఫోన్ లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసి ఓటీపీ కొట్టిన వెంటనే కేవలం కొత్త మొబైల్లో మాత్రమే ఒక వాట్సాప్ నంబర్ యాక్షన్‌లో ఉంటుంది. కానీ ఈ విధంగా చేస్తే ఓకేసారి రెండు మొబైల్ ఫోన్లలో ఓకే వాట్సాప్ నంబర్ అకౌంట్ మెయింటైన్ చేయవచ్చు.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్‌గా మారింది.