Xiaomi 13 Series: షావోమీ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం
- By Nakshatra Published Date - 07:00 AM, Tue - 13 December 22
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్ లు కలిగిన సరికొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే షావోమి సంస్థ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసింది. షావోమి 12 సిరీస్ కు కొనసాగింపుగా 13 సిరీస్ మొబైల్స్‌ను చైనా మార్కెట్ లోకి ఆవిష్కరించింది. షావోమి 13, 13 ప్రో రెండు వేరియంట్లను తాజాగా తీసుకొచ్చింది. ఐఫోన్ మాదిరి డిజైన్‌లో ఆండ్రాయిడ్ 13 MIUI 14తో వీటిని తీసుకొచ్చింది.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్ లలో లైకా బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను అమర్చింది. ఇండియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఎపుడు లాంచ్ అవుతుందనేది స్పష్టత లేదు. ఇకపోతే షావోమి 13 ప్రో స్పెసిఫికేషన్ ల వివరాల విషయానికి వస్తే.. 6.73 అంగుళాల AMOLED డిస్ప్లే 3200×1440 రిజల్యూషన్,120Hz రిఫ్రెష్ రేట్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రెంట్ కెమెరా 4820 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంను కలిగి ఉండనుంది. కాగా ఈ షావోమీ 13 ప్రో ధర విషయానికి వస్తే. స్మార్ట్ఫోన్లు రెండూ వైట్, బ్లాక్, గ్రీన్, లైట్ బ్లూ కలర్లలో లభించనున్నాయి. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 60 వేల నుండి ప్రారంభం కానుంది.
12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సుమారు రూ. 74,500 గా ఉంది. అలాగే షావోమి 13 ఫీచర్ ల విషయానికి వస్తే.. 6.36 అంగుళాల OLED డిస్ప్లే,1080 x 2400పిక్సెల్స్ రిజల్యూషన్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. ఇకపోతే షావోమి13 ధర విషయానికి వస్తే.. 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 574 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 47,344 గా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 617 డాలర్లు అనగా రూ. 50891 కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 660 డాలర్లు అనగా రూ. 54438 గా ఉంది. అలాగర్ 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 718 డాలర్లు అనగా రూ. 59222 గా ఉంది.
Related News
OnePlus Nord CE 4: అద్భుతమైన ఫీచర్లతో అదరగొడుతున్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. తక్కువ బడ్జెట్ కే?
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే.