Xiomi Headband: షావోమి హెడ్ బ్యాండ్.. మెదడులో ఆలోచనలు ఇట్టే చెప్పేస్తుందట?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ ల తయారీ సంస్థ షావోమి మనిషి మెదడులోని ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే
- By Nakshatra Published Date - 09:45 AM, Sat - 13 August 22
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ ల తయారీ సంస్థ షావోమి మనిషి మెదడులోని ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే ఒక హెడ్ బ్యాండ్ ను రూపొందించబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. దానిని ఎంఐజీయూ హెడ్‌బ్యాండ్ పేరుతో రూపొందిస్తున్నామని,అయితే ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో పనిచేస్తుందని తెలిపింది. మన ఇంట్లో ఉండే స్మార్ట్ పరికరాలు టీవీ, లైట్, ఫ్యాన్ తదితరాలను ఈ హెడ్‌బ్యాండ్ రిమోట్ కంట్రోల్ మాదిరిగా నియంత్రించగలదు అని పేర్కొంది. అయితే అందుకు మాన్యువల్‌గా కమాండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే స్మార్ట్ఫోన్లలో ఉండే ఫీచర్ల ఆధారంగా నియంత్రించాల్సిన పనిలేదు.
కేవలం మనిషి ఆలోచనతో మాత్రమే ఈ హెడ్‌బ్యాండ్ ఆయా పరికరాలను నియంత్రిస్తుంది. ఇక ఈ హెడ్‌బ్యాండ్ పెట్టుకున్న ఇంటి యజమాని.. గాలి తక్కువగా వస్తోంది.. కొంచెం ఫ్యాన్ వేగం పెరగాలి అని తలుచుకుంటే చాలు.. స్మార్ట్ ఫ్యాన్ వేగం పెరుగుతుంది. అదేవిధంగా.. స్మార్ట్ బల్బ్‌లను నియంత్రించవచ్చు.బెడ్రూంలోని బల్బ్ రంగు ముదురు ఆకుపచ్చకు మారి, వెలుతురు 10శాతానికి తగ్గాలి అనుకుంటే చాలు వెంటనే ఈ హెడ్‌బ్యాండ్ ఆ మేరకు సంబంధిత బల్బ్‌ను నియంత్రింస్తుంది.
అయితే ప్రస్తుతం ఇటువంటి స్మార్ట్ పరికరాలను, స్మార్ట్ ఫోన్ల ద్వారా నియంత్రించే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో ఏ మూలను ఉన్నా కూడా ఈ స్మార్ట్ ఫోన్ యాప్ ల ద్వారా గృహపకరణాలను నియంత్రించవచ్చట. ఇప్పుడు అదే పనిని యూజర్ల ఆలోచనలకు అనుగుణంగా చేసిపెట్టేలా ఎంఐజీయూ హెడ్‌బ్యాండ్‌ను తమ ఇంజనీర్లు రూపొందిస్తున్నారని షావోమి వివరించింది. అయితే ఈ హెడ్‌బ్యాండ్ ద్వారా మెదడు సిగ్నళ్లను అందుకునేందుకు, యూజర్ ఎలకో్ట్ర ఎన్సెఫాలోగ్రఫీ వేవ్‌ఫామ్స్ చదివేందుకు సెన్సర్ లు ఉంటాయట. యూజర్ల మూడ్ ఆధారంగా, ఎమోషన్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేవ్ ఫామ్స్‌ను హెడ్‌బ్యాండ్‌లోని ఆర్టిఫిషియల్ లేబుల్డ్ మెషీన్ గ్రహించి,వాటి ఆధారంగా మనిషి ఆలోచనలను ఈ హెడ్‌బ్యాండ్ అమలు చేస్తుంది అని షోవోమి సంస్థ పేర్కొంది.
Related News
Brain: మీరు నిద్రపోయాక అసలేం జరుగుతుంది? మీ బ్రెయిన్ సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తాయో తెలుసా?
మామూలుగా మన నిద్ర పోయిన తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుంది? బ్రెయిన్ లో ఏం జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకోవాలని చాలామందికి కుతూహలం