Flying Race Car: ఆకాశంలో ఎగిరే రేసింగ్ కార్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?
ఫార్ములా వన్ కార్ రేసింగ్ ఏ రేంజ్ లో ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా
- By Nakshatra Published Date - 07:00 AM, Fri - 24 February 23
ఫార్ములా వన్ కార్ రేసింగ్ ఏ రేంజ్ లో ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్ములా వన్ కార్ రేసింగ్ కు విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. కాగా హైదరాబాద్ లో ఈ దీనిపై చాలామందికి అవగాహన పెరిగింది. ఇకపోతే త్వరలో కార్ రేసింగ్ జరిగే అవకాశం ఉంది. అందుకు గానూ ప్రపంచంలోనే మొట్టమొదటి గాలిలో ఎగిరే రేస్ కార్ ను ఆస్ట్రేలియాలో ఆవిష్కరించారు. అయితే ఇది ఏకంగా గంటకు 360 కిలోమీటర్ల వేగంతో గాలిలో దూసుకుపోతుందట. ఇదే విషయాని ఆ కారును తయారు చేసిన కంపెనీ ప్రకటించింది.
కాగా ఆస్ట్రేలియా లోని అడిలైడ్ లో ఉన్న అలౌడా ఏరోనాటిక్స్ అనే కంపెనీ ఎయిర్ స్పీడర్ ఎంకే4 ని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫ్లయింగ్ కారుగా రికార్డులకెక్కింది. ఇది ఫార్ములా వన్ రేసింగ్ కార్లతో సమానమైన హ్యాండ్లింగ్ ను అందిస్తుందట. ఇది నిట్ట నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ అవుతుందట. అలాగే ఇందులో ఏఐ గింబాల్డ్ థ్రస్ట్ టెక్నాలజీ తో వస్తోంది. ఫ్లయింగ్ రేస్ కార్ ఎయిర్ స్పీడర్ ఎంకే4 హైడ్రోజన్ టర్భోజెనరేటర్ మోటర్ ఉంటుంది. 1,340 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 30 సెకన్లలోనే 360 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఏకధాటిగా 300 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది.
దీనిని నడపడానికి పైలెట్ అవసరం. ఇది అధునాతన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ, అధునాతన ఏరోడైనమిక్స్ వస్తోంది. దాదాపు 950 కిలోల బరువుతో టేకాఫ్ కాగలుగుతుంది. అలౌడా ఏరోనాటిక్స్ సీఈఓ మాట్ పియర్సన్ మాట్లాడుతూ గాలిలో కార్ రేస్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు గానూ తన ఎయిర్ స్పీడర్ ఎంకే4 ఫ్లయింగ్ రేస్ కార్ ను ఆవిష్కించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఈ ఫ్లయింగ్ రేస్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చని.. అందుకు తగిన ఎంట్రీలు ప్రారంభించినట్లు వివరించారు. ఇది మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో ఓ కీలక ఘట్టమవుతుందని పేర్కొన్నారు.
Related News
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ముఖ్యం..?
MI తన చివరి 3 మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను చాలా మిస్ అయ్యింది. అయితే, నాలుగో మ్యాచ్‌కు ముందు MIకి శుభవార్త వెలువడింది. టీ20లో నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ లీగ్‌లోకి వస్తున్నాడు.