WhatsApp Login : వాట్సాప్ ” లాగిన్ అప్రూవల్ ” ఫీచర్ వస్తోంది.. ఏంటిది?
ఇన్ స్టాగ్రామ్ తరహాలో మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. దానివల్ల మీ వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ల బారిన పడే ఛాన్స్ ఉండదు.
- By Hashtag U Published Date - 07:15 AM, Sun - 7 August 22
ఇన్ స్టాగ్రామ్ తరహాలో మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. దానివల్ల మీ వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ల బారిన పడే ఛాన్స్ ఉండదు. ఇంతకీ అదేం ఫీచర్ అనుకుంటున్నారా? “లాగిన్ అప్రూవల్ ఫీచర్”. మీరు మీ స్మార్ట్ ఫోన్లో కాకుండా వేరే ఏదైనా డివైజ్ లో వాట్సాప్ లాగిన్ అయితే ఈ ఫీచర్ పని చేస్తుంది. వేరే డివైజ్ ద్వారా వాట్సాప్ లోకి లాగిన్ కాగానే.. మీ స్మార్ట్ ఫోన్ కు అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా మీ వాట్సాప్ అకౌంట్ ను హ్యాక్ చేసి.. వేరే డివైజ్ నుంచి లాగిన్ అయితే గుర్తించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీ ఫోన్ కు వచ్చిన అలర్ట్ నోటిఫికేషన్ ని క్లిక్ చేసి.. అది మీరేనా ? కాదా? అనేది తెలియజేయాలి. అది మీరే అని చెబితే.. లాగిన్ కొనసాగుతుంది. లేదంటే వెంటనే.. మరో డివైజ్ నుంచి లాగిన్ అయిన వాట్సాప్ అకౌంట్ లాగ్ ఔట్ అవుతుంది. దీంతోపాటు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ అయ్యే మెస్సేజెస్ లో అనవసరంగా ఉన్నవాటిని ఎవ్వరికీ కనిపించకుండా అడ్మిన్ తొలగించే ఛాన్స్ ఉంటుంది.
వాట్సాప్ లో ఉబెర్ క్యాబ్ బుకింగ్..
తాజాగా ఉబెర్ క్యాబ్ సంస్థ వాట్సాప్ లోనే బుక్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు కల్పించింది. ఇప్పుడు యూజర్లు ఉబెర్ యాప్ డౌన్లోడ్/ఓపెన్ చేయాల్సిన అవసరమే లేకుండా వాట్సాప్ ద్వారానే రైడ్లను నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ సేవ లక్నో యూజర్లకు ఇంతకుముందే అందుబాటులోకి రాగా ఇప్పుడు ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. యూజర్ రిజిస్ట్రేషన్, రైడ్ బుక్ చేయడం, ట్రిప్ రసీదు పొందడం నుంచి ప్రతిదీ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారానే రైడర్లు పూర్తి చేయవచ్చు. వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి పికప్, డ్రాప్-ఆఫ్ డెస్టినేషన్ వివరాలు అందిస్తే సరిపోతుంది.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్‌గా మారింది.