Whatsapp: వాట్సాప్ లోకి మరో సరికొత్త ఫీచర్.. అదేమిటంటే?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు
- By Anshu Published Date - 07:00 AM, Thu - 15 December 22

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే వాట్సాప్ సంస్థ వ్యూ వన్స్ టెక్ట్స్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌లో మెసేజ్ ను రిసీవర్ ఒక్కసారే మాత్రమే చూడగలరు. రిసీవర్ చదవిన వెంటనే ఆ మెసేజ్ ఆటో మేటిక్‌గా డిలీట్ అవుతుంది. అటు మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి కూడా ఆ మెసేజ్ కనపించదు.
తమ వాట్సాప్ చాట్‌ను ఎవరూ చూడకుండా సీక్రెట్‌గా ఉండాలనుకునే యూజర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది తమ వాట్సాప్ ను ఇతర వ్యక్తులు చూడకూడదు అనుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. వేబేటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. అయితే పూర్తిస్థాయిలో వాట్సాప్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ ని ఎప్పుడూ తీసుకురానున్నారు అన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.
వాట్సాప్ సంస్థ అధికారికంగా ప్రకటించే అంతవరకు వేచి చూడాల్సిందే మరి. కాగా ఇప్పటికే వాట్సాప్‌లో వన్స్ వ్యూ ఫీచర్ వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉన్న విషయం తెలిసిందే. వీడియోలు, ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ద్వారా ఒక్కసారి మాత్రమే కనిపించి ఆ తరువాత అదృశ్యమవుతాయి. దీన్ని ఫార్వార్డ్ చేయడం, స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది వాట్సాప్ సంస్థ.