WhatsApp Channels: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ ఛానల్లో పర్సనల్ చాట్స్?
ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. కాగా వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువ
- By Anshu Published Date - 05:55 PM, Sat - 6 July 24

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. కాగా వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. తాజాగా కూడా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ను భారత్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వాట్సాప్ యూజర్లు తమకు సంబంధించిన అప్‌డేట్ లను పొందడానికి వాట్సాప్ ఛానెల్‌లు ఒక ప్రైవేట్ మార్గంగా చెప్పవచ్చు. ఈ ఫీచర్ మరింత మెరుగుపరిచేందుకు గో-టు-మెసెంజర్ అప్లికేషన్ కొత్త అప్‌డేట్‌తో వస్తోంది. అయితే ఈ కొత్త అప్‌డేట్ లో వాట్సాప్ ఛానెల్ ఓనర్లు వారి వ్యక్తిగత చాట్ నుంచి నేరుగా మెసేజ్ లు, మీడియాను ఫార్వార్డ్ చేయడానికి ఒక ఫీచర్‌ను తీసుకువస్తోంది.
అయితే ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ద్వారా ఛానెల్ యజమానులు వారి వ్యక్తిగత చాట్‌ల నుంచి నేరుగా వారి ఛానెల్ లకు మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు, జిఫ్ త్వరగా సులభంగా షేర్ చేయవచ్చు. కాగా ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్ లకు నత్రమే అందుబాటులో ఉంది. త్వరలో రెగ్యులర్ యూజర్ లు అందరికి కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. బీటా ప్రోగ్రామ్‌లోని కొంతమంది వినియోగదారులు ఇప్పుడు కొత్త ఛానెల్ ఫార్వార్డింగ్ ఫీచర్‌ను పొందవచ్చు. వాట్సాప్ ఇప్పుడు ఈ మార్పును పబ్లిక్‌తో టెస్టింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఫీచర్‌లో ఛానెల్ అడ్మిన్లు థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా ఫైల్ ఎక్స్‌ప్లోరర్ వంటి ఇతర యాప్‌ల నుంచి నేరుగా వారి ఛానెల్‌లకు వారి మీడియాను కూడా షేరింగ్ చేయవచ్చు.