WhatsApp Group Admin Review : వాట్సాప్ గ్రూప్ లోనూ ఇక అడ్మిన్ రివ్యూ ఫీచర్!
WhatsApp Group Admin Review : వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చేటందుకు రెడీ అవుతోంది..
- By Pasha Published Date - 10:36 AM, Sun - 6 August 23

WhatsApp Group Admin Review : వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చేటందుకు రెడీ అవుతోంది..
వాట్సాప్ గ్రూప్ చాట్‌ల కోసం అడ్మిన్ రివ్యూ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తును స్పీడప్ చేసింది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. గ్రూప్ అడ్మిన్‌లకు గ్రూప్ సెట్టింగ్స్ లో కొత్త ఆప్షన్స్ అందుబాటులోకి వస్తాయి.
Also read : Rakhi Festival-2 Days : ఈసారి రాఖీ పండుగ రెండు రోజులు.. ఎందుకంటే ?
వాట్సాప్ గ్రూప్ లలో వచ్చే ఏదైనా మెసేజ్ పై మెంబర్స్ కు అభ్యంతరం ఉంటే గ్రూప్ అడ్మిన్ కు రిపోర్ట్ చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. గ్రూప్ అడ్మిన్ కు రిపోర్ట్ చేసే మెసేజ్ లు.. గ్రూప్ ఇన్ఫో స్క్రీన్‌లో కనిపించబోయే న్యూ సెక్షన్ లో లిస్ట్ అవుతాయి. తనకు వచ్చిన రిపోర్ట్ పై గ్రూప్ అడ్మిన్ స్పందించి తగిన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ మెసేజ్ ను తొలగించడం లేదా కొనసాగించడం లేదా మెసేజ్ పెట్టిన వ్యక్తిని హెచ్చరించి వదిలేయడంపై తుది నిర్ణయాన్ని అడ్మిన్ తీసుకుంటాడు.
గ్రూప్ లో సమన్వయాన్ని పెంచేందుకు వంతెనలా..
వాట్సాప్ గ్రూప్ చాట్స్ లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ ఫీచర్ దోహదం చేస్తుందని చెప్పొచ్చు. వాట్సాప్ గ్రూప్ నిర్వహణ విషయంలో గ్రూప్ అడ్మిన్ , గ్రూప్ లోని సభ్యుల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు అడ్మిన్ రివ్యూ ఫీచర్ ఒక వంతెనలా పనిచేయనుంది. గ్రూప్ అడ్మిన్ లు బిజీగా ఉన్న సమయాల్లో .. ఇతర సభ్యులు పంపే రిపోర్ట్ హెచ్చరికలను చూసి అలర్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ అవకాశాన్ని కల్పిస్తుంది.
Also read : Weekly Horoscope : ఈవారం రాశి ఫలితాలు.. ఆగస్టు 6 నుంచి 12 వరకు వార ఫలాలు
గ్రూప్ చాట్ అడ్మిన్ రివ్యూ ఫీచర్ ప్రస్తుతం WhatsApp బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. ఇది రాబోయే రోజుల్లో మరింత మంది వ్యక్తులకు అందుబాటులోకి రాబోతోంది. Android 2.23.16.18 అప్ డేట్ ద్వారా WhatsApp బీటా వినియోగదారులు ఈ ఫీచర్ ను టెస్ట్ చేయొచ్చు.