WhatsApp: వాట్సాప్ ని వినియోగిస్తున్నారా.. అయితే ఈ ఫీచర్ ఆన్ లో ఉంచుకోవాల్సిందే?
ప్రముఖ మెసెంజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. మ
- By Nakshatra Published Date - 07:29 PM, Mon - 4 September 23
ప్రముఖ మెసెంజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ విషయంలో ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ వినియోగదారుల గోపీచంద్ మెరుగుపరచుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్ సంస్థ. ఈ క్రమంలోనే ఇటీవల వాట్సాప్ కంపెనీ
వాట్సాప్ చాట్ అనే అప్డేట్ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.
దీనిలో కంపెనీ గోప్యతకు సంబంధించిన ఫీచర్ల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తోంది. ఇకపోతే ఒకవేళ మీరు కూడా వాట్సాప్ ని వినియోగిస్తుంటే మీరు మీ మొబైల్ ఫోన్లో వెంటనే ఆన్ చేయవలసిన వాట్సాప్ 4 సెట్టింగ్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండటానికి 2FA ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ఆన్‌లో ఉంచడం వల్ల మీరు మీ అకౌంట్‌ను మరొక డివైజ్‌లో ఓపెన్ చేసినప్పుడు లేదా కొంత సమయం తర్వాత దాన్ని తెరిచినప్పుడు, వాట్సాప్ మీరు సెట్ చేసిన 6 అంకెల పిన్ను అడుగుతుంది. అలాంటి పరిస్థితిలో, మరెవరూ మీ ఖాతాను తెరవలేరు. వాట్సాప్ మీ చాట్లను రక్షించడానికి యాప్ లాక్, చాట్ లాక్‌ని అందిస్తుంది.
రెండింటినీ ఆన్‌లో ఉంచడం ద్వారా, మీ ఖాతా మరింత సురక్షితం అవుతుంది. బయటి వ్యక్తి మీ చాట్లు లేదా డేటాను తెరవలేరు. వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాక ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ప్రైవసీకి సంబంధించిన ఇతర ఆప్షన్స్ ఉంటాయి. అందులో చాలా రకాల ఆప్షన్ ఉంటాయి. వాటిలో గ్రూప్‌లో ఎవరు మిమ్మల్ని యాడ్ చేయవద్దు. ఎవరు యాడ్ చేయాలి వంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అలాగే, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదు. మెసేజ్ టైమర్ ప్రైవసీ వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. వాటిని ఆన్‌లో ఉంచుకోవచ్చు.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్‌గా మారింది.