WhatsApp: వాట్సాప్ లో మీరు ఇలా చేస్తే చాలు.. మీ లొకేషన్ ట్రాక్ చేయడం అసాధ్యం!
వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.
- By Anshu Published Date - 12:35 PM, Tue - 20 August 24

ఇటీవల కాలంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ ద్వారా జరుగుతున్న మోసాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కొంతమంది సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ ను ఆధారంగా చేసుకుని కొన్ని రకాల మోసాలకు పాల్పడుతున్నారు. మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లతో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ లక్ష్యంగా స్కామర్లు మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారులను ప్రొటెక్ట్ చేసేందుకు మెటా కొత్త భద్రతా ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ కాల్ సమయంలో యూజర్ల ఐపీ అడ్రస్ ఉపయోగించి వారి లొకేషన్ ట్రాక్ చేయకుండా నివారించేందుకు అనుమతిస్తోంది.
కాగా వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. వాట్సాప్ కాల్ ప్రైవసీ లో సెట్టింగ్ లలో ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనే కొత్త ఆప్షన్ పై టెస్టింగ్ చేస్తోంది. వాట్సాప్ సర్వర్ ల ద్వారా కాల్ ను రూట్ చేయడం ద్వారా వాట్సాప్ కాల్ సమయంలో మీ లొకేషన్ ను ట్రాక్ చేయలేరు. కొత్త ఆప్షన్ ద్వారా కాల్స్ సమయంలో యూజర్ల ప్రైవసీ రిలే ఫీచర్ లాగా పనిచేస్తుంది. సర్వర్ ల ద్వారా సురక్షితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఈ సమయంలో యూజర్ల లొకేషన్ గుర్తించడం కష్టతరం చేస్తుందని నివేదిక పేర్కొంది. అయితే, ఈ ఫీచర్ యూజర్ల అదనపు భద్రతను అందించినప్పటికీ, కాల్ క్వాలిటీ విషయంలో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది.
ఎందుకంటే కాల్ వాట్సాప్ సర్వర్‌ల ద్వారా రూట్ అవుతుంది. ఇది డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి రూట్ చేస్తుంది. ఎన్‌క్రిప్షన్, రూటింగ్ ప్రాసెస్ కారణంగా కాల్ క్వాలిటీపై ప్రభావం పడుతుంది. కొత్త IP అడ్రస్ ప్రొటెక్షన్ ఫీచర్ కాల్స్ సమయంలో మీ లొకేషన్ డేటా ప్రైవసీని మెరుగుపరచడానికి రూపొందించింది. మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తులకు మీ కచ్చితమైన లొకేషన్ గుర్తించడం మరింత సవాలుగా మారుతుంది. వాట్సాప్ ఇంకా ఈ ఫీచర్ గురించి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది..