WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై సరికొత్త కీబోర్డు?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి వాట్సాప్ వినియోగదారుల సంఖ్య
- By Nakshatra Published Date - 07:30 PM, Mon - 12 June 23
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాగా వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా అప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. కాగా ఇప్పటికే సెట్టింగ్స్ విషయంలో స్టేటస్, ప్రొఫైల్, లాస్ట్ సీన్, చాట్ ఇలా అనేక రకాల ఫీచర్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ వినియోగదారుల కోసం వాట్సాప్ సంస్థ మరో సరికొత్త అదిరిపోయే అప్డేట్ ని తీసుకువచ్చింది.
ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా వాట్సాప్ సరికొత్త కీ బోర్డును ప్రవేశపెట్టింది. దానిలో ఎమోజీలను ప్రవేశపెట్టింది. ఇకపై మాటల్లేవ్, మాట్లాడుకోవటాల్లేవ్ కేవలం ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే ఉంటాయి అనే విధంగా దీనిని అప్ డేట్ చేసింది. అయితే ప్రస్తుతం ఇది కొన్ని బీటి వెర్షన్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది. రీడిజైన్డ్ ఎమోజీ కీబోర్డుగా పిలిచే ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు ఎమోజీ కీబోర్డును పైకి స్క్రోల్ చేయడం కుదురుతుంది. కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ప్రముఖ వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.
ఆ రిపోర్టు ప్రకారం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.12.19 అప్డేట్లో కొత్త కీబోర్డ్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇన్స్టాల్ చేసుకున్న యూజర్లు ఆ కీబోర్డును యాక్సెస్ చేయవచ్చు. ఈ కొత్త ఎమోజీ కీబోర్డును వారు పైకి స్క్రోల్ చేయడం కుదురుతుంది. సాధారణంగా స్టాండర్డ్ వాట్సాప్ వెర్షన్లో అందుబాటులో ఉన్న ఎమోజీ కీబోర్డ్‌ను ఓపెన్ చేశాక అందులో ఉన్న ఎమోజీలు కిందకి, పైకి స్క్రోల్ చేయవచ్చు. కానీ ఆ కీబోర్డ్‌ను అంతటా పైకి స్క్రోల్ చేసే వెసులుబాటు లేదు. అయితే కొత్త రీడిజైన్డ్ కీబోర్డును మాత్రం పైకి డ్రాగ్ చేయవచ్చు. ఆ విధంగా ఎమోజీల డిస్ప్లేకు సంబంధించి వైడర్ వ్యూ పొందవచ్చు
వైడర్ వ్యూలో ఒకేసారి చాలా ఎమోజీలు కనిపించడం వల్ల కావాల్సిన ఎమోజీని వెంటనే సెలెక్ట్ చేసుకోవడం వీలవుతుంది. అయితే కొత్తగా వాట్సాప్ తీసుకొచ్చిన ఈ రీడిజైన్డ్ ఎమోజీ కీబోర్డ్‌లో మరొక మార్పును కూడా మనం గమనించవచ్చు. అదేంటంటే ఎమోజీలు, గిఫ్స్, స్టిక్కర్స్, అవతార్స్ వంటి ట్యాబ్స్‌ను కొత్త ఎమోజీ కీ బోర్డ్‌లో పైన భాగంలో చేర్చింది. స్టాండర్డ్ యాప్ వెర్షన్లో ఈ ట్యాబ్స్ అనేవి కింది భాగంలో ఉన్నాయి. ఇక కొంతమంది బీటా టెస్టర్లు మీడియా షేరింగ్, ఎమోజీ కీబోర్డ్ బటన్ల కొత్త అరేంజ్మెంట్స్ కూడా ట్రై చేయవచ్చు.
Related News
WhatsApp In App Dialer : వాట్సాప్‌లో ‘ఇన్-యాప్ డయలర్’.. కాంటాక్ట్ లిస్టులో లేని నంబర్లకూ కాల్స్!
WhatsApp In App Dialer : మనం ప్రస్తుతం ట్రూకాలర్, గూగుల్ డైలర్లకు చెందిన ఇన్-యాప్ డయలర్లను ఎక్కువగా వాడుతున్నాం.