WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది వాట్సాప్.
- By Anshu Published Date - 03:00 PM, Tue - 19 November 24

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఈ వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. రోజురోజుకీ ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. దాంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
మామూలుగా మనం ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కొంతమంది వ్యక్తులతో పర్సనల్ గా చాటింగ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ చాట్ ఇతరులకు కనిపించకుండా ఉండడం కోసం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి వారి కోసమే వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. చాట్ లాక్ ఫీచర్ పేరుతో ఈ కొత్త ఫీచర్ ను పరిచయం చేసారు. అంటే వ్యక్తిగత చాటను ఇందులో భద్రంగా దాచుకోవచ్చన్నమాట. మీ వ్యక్తిగత చాట్ లను సీక్రెట్ కోడ్ ను క్రియేట్ చేసుకొని మీ ప్రైవేట్ చాట్ ని రహస్యంగా దాచుకునే అవకాశం కల్పించారు.
అయితే ఇలా లాక్ చేసిన చాట్ లను లాక్డ్ చాట్స్ సెక్షన్ లో చూసుకోవచ్చట. ఈ లాక్డ్ చాట్స్ సెక్షన్ ను ఇతరులు ఓపెన్ చేసేందుకు వీలు లేకుండా సీక్రెట్ పాస్‌వర్డ్ ను సెట్ చేసుకోవచ్చట. దీంతో మీ చాట్ లు భద్రంగా ఉంటాయట. అలాగే ఇది యాప్ లో కనిపించకుండా చూసుకోవచ్చట. ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ మెసేజ్ లను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. దీంతో ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదట. మీ సీక్రెట్ చాటింగ్స్ ఓపెన్ చేయాలంటే సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తే చాటింగ్ కనిపిస్తుంది. సీక్రెట్ చాటింగ్ కావాలి ఎవరు చూడకూడదు అనుకున్న వారికి ఈ ఫీచర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పాలి.