WhatsApp: వాట్సాప్ లో ఆ ఫీచర్ తొలగింపు.. ఇకపై అలాంటివాటికి ఛాన్సే లేదు!
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. నిత్యం
- By Anshu Published Date - 05:50 PM, Mon - 7 November 22

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. నిత్యం కోట్లాదిమంది ఈ వాట్సాప్ ను చాటింగ్ చేయడం కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇకపోతే వాట్సాప్ వినియోగదారులు పెరుగుతున్న కొద్ది వాట్సాప్ సంస్థ కూడా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రైవసీ సెక్యూరిటీ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. కాగా ఇప్పటికే వాట్సాప్ సంస్థ ఫోటోల విషయంలో, మెసేజెస్ విషయంలో, స్టేటస్ ప్రైవసీ విషయంలో, ప్రొఫైల్ ఫోటో విషయంలో ఇలా అనేక రకాల సెట్టింగ్ లను వాట్సాప్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా వాట్సాప్ ను దుర్వినియోగం చేసే వారి వాట్సాప్ అకౌంట్ లను కూడా ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తోంది వాట్సాప్ సంస్థ. ఇది ఇలా ఉంటే వాట్సాప్ కి సంబంధించిన మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే వాట్సాప్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సప్ యూజర్ లకు వ్యక్తిగత గోప్యత కోసం ఏడాది క్రితం వ్యూ వన్స్ ఫీచర్ ని ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే.
ఈ ఫీచర్ ద్వారా పంపే ఫోటోలు వీడియోలు యూజర్స్ ఒకసారి మాత్రమే చూడగలరు. అంతేకాకుండా ఫోటోలు వీడియోలు గ్యాలరీలో కూడా సేవ్ కావు అన్న విషయం మనకు తెలిసిందే. వ్యూ వన్స్ ద్వారా షేర్ చేసిన ఫోటోలను స్క్రీన్ షాట్ కూడా తీయలేదు. కానీ డెస్క్ టాప్ వెర్షన్ లో ప్రింట్ ఇతర టూల్స్ ఫైల్స్ ను ఉపయోగించి స్క్రీన్ షాట్ తీస్తున్నట్లు వాట్సాప్ సంస్థ గుర్తించి డెస్క్ టాప్ వెబ్ వెర్షన్ లో కూడా వ్యూ వన్స్ ఫ్యూచర్ ని పూర్తిగా తొలగించండి.