Whatsapp : మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ కాకూడదంటే.. ఇలా చేయాలి
Whatsapp : వాట్సాప్ మన దేశంలోని అనుమానాస్పద అకౌంట్ల ఏరివేతను వేగవంతం చేసింది.
- By Pasha Published Date - 01:17 PM, Mon - 6 November 23

Whatsapp : వాట్సాప్ మన దేశంలోని అనుమానాస్పద అకౌంట్ల ఏరివేతను వేగవంతం చేసింది. ఈక్రమంలో ఒక్క సెప్టెంబరు నెలలోనే 71 లక్షల డౌట్‌ఫుల్ వాట్సాప్ అకౌంట్లను తొలగించింది. వాట్సాప్‌కు భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. అయితే ఇందులో నుంచి సాధ్యమైనంత మేర అనుమానాస్పద అకౌంట్లను ఏరిపారేయడం ద్వారా మరింత పారదర్శక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని వాట్సాప్ భావిస్తోంది. తమ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా యాక్టివిటీ చేసే అకౌంట్లనే తొలగిస్తున్నామని వాట్సాప్ అంటోంది. తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగానూ పలు అకౌంట్లను బ్యాన్ చేశామని(Whatsapp) చెబుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
వాట్సాప్ అకౌంట్ బ్యాన్ కాకూడదంటే ఇవి పాటించాలి
- వాట్సాప్ అకౌంట్ బ్యాన్ కాకూడదని భావిస్తే.. మీరు జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్ వంటి అనధికారిక యాప్‌లను వాడొద్దు.
- మరొకరి పేరుతో వాట్సాప్ ఖాతాలు ఓపెన్ చేయకూడదు.
- వాట్సాప్ నుంచి అభ్యంతరకరమైన మెసేజ్‌లను పెట్టకూడదు. వీటిని ఎవరైనా రిపోర్ట్ చేసినా, వాట్సాప్ స్వయంగా గుర్తించినా అకౌంట్ బ్యాన్ కావడం ఖాయం.
- అవతలి వ్యక్తుల అనుమతులు లేకుండా ప్రమోషనల్, బిజినెస్ మెసేజ్ లు పంపకూడదు.
- ఒకవేళ ఖాతా బ్లాక్ అయితే వెంటనే వాట్సాప్ కు అప్పీల్ చేయాలి. మీరు చెప్పే కారణాలు కరెక్ట్ అని భావిస్తే వాట్సాప్ అకౌంట్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.