HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Whatsapp Another Amazing Feature In Whatsapp Without Affecting The Eyes

Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త.. కళ్ళకు ఎఫెక్ట్ పడకుండా అలా?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజి

  • Author : Anshu Date : 03-01-2024 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 03 Jan 2024 03 06 Pm 6381
Mixcollage 03 Jan 2024 03 06 Pm 6381

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.

ఈ సరికొత్త ఫీచర్ వల్ల కళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అయితే ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్‌ దశలో ఉంది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి ఇప్పటికే వాట్సాప్‌లో డార్క్‌ మోడ్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని కొత్తగా అప్‌డేట్ చేయాలని వాట్సాప్‌ ప్లాన్‌ చేస్తోంది. ఆ ఫీచర్ కి సంబంధించిన మరిన్ని వివరాల విషయానికి వస్తే.. వాట్సాప్ యూజర్ల కంటిపై ఒత్తిడి పడకుండా ఉండడం కోసం దీనిని డిజైన్ చేస్తున్నారు. వాట్సాప్ వెబ్‌లో కొత్త కలర్స్, టాప్ బార్, బ్యాక్‌గ్రౌండ్, మెసేజ్ బబుల్స్‌లో కలర్ స్కీమ్, సైడ్‌బార్‌ను మరింత ఆధునికంగా రీడిజైన్ చేసి, తక్కువ కాంతిని ఇచ్చే విధంగా అప్డేట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంటుందట.

ఇదిలా ఉంటే వాట్సాప్‌ ఇది వరకే 2020లో వెబ్‌ వెర్షన్‌ కోసం డార్క్‌ మోడ్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను అప్‌డేట్ చేస్తూ మరింత తక్కువ లైట్‌తో పనిచేసేలా చేయనున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేష్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇకపోతే ఇటీవలే స్టేటస్‌లో వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్‌లకు ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ ను షేర్‌ చేసే అవకాశం వాట్సాప్‌ కల్పిస్తోంది. ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తే ల్యాప్‌టాప్‌, కంప్యూటర్ల నుంచి సైతం వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కలుగనున్నది. స్టేటస్‌ అప్‌డేట్‌ చేసిన సమయంలో కంటెంట్ మొత్తం ఎండ్-టు-ఎండ్ ప్రొటెక్ట్ చేయబడుతుందని వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన ఫీచర్స్ అన్ని కూడా యూజర్స్ కు సంతృప్తిని ఇచ్చాయని తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazing feature in WhatsApp
  • eyes
  • whatsapp
  • whatsapp new feature

Related News

ENT Specialists

కళ్లు, ముక్కు, చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే!

ఎప్పుడూ పర్ఫ్యూమ్స్, పౌడర్ లేదా డియోడరెంట్లను ఉపయోగించకూడ‌ద‌ని నిపుణులు చెప్పారు. ఇవి కళ్లు, ముక్కుకు చికాకు (ఇరిటేషన్) కలిగించే సాధారణ కారకాలు అని పేర్కొన్నారు.

  • WhatsApp

    వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

Latest News

  • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

  • ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

  • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

  • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

  • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd