WhatsApp Status : సీక్రెట్‌గా ఇతరుల వాట్సాప్ స్టేటస్ చూసేయండి..
WhatsApp Status : మన మనసులో నడుస్తున్న ‘స్టేటస్’ ఏమిటో అందరికీ చెప్పుకోవడానికి.. ఇప్పుడు ‘వాట్సాప్ స్టేటస్’ను పెట్టుకోవడం కామన్‌గా మారిపోయింది!!
- By Pasha Published Date - 06:20 AM, Sat - 18 November 23
WhatsApp Status : మన మనసులో నడుస్తున్న ‘స్టేటస్’ ఏమిటో అందరికీ చెప్పుకోవడానికి.. ఇప్పుడు ‘వాట్సాప్ స్టేటస్’ను పెట్టుకోవడం కామన్‌గా మారిపోయింది!! అయితే వాట్సాప్ స్టేటస్‌ను ఎదుటి వ్యక్తులకు తెలియకుండా.. ఎలా చూడాలి ? అసలు అలా చూడొచ్చా ? అనే డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. ఔను.. ఆ ఛాన్స్ ఉంది. ఇతరులకు తెలియకుండానే వాళ్ల స్టేటస్‌ను సీక్రెట్‌గా చూసేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join.
సీక్రెట్స్ ఇవీ..
- సీక్రెట్‌గా ఇతరుల వాట్సాప్ స్టేటస్‌ను చూసేందుకు మీరు.. మీ ఫోన్లో ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ను ఆన్ చేయాలి. మొబైల్ డేటా, వైఫై డేటా ఆఫ్ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి సేవ్ అయి ఉన్న వాట్సాప్ స్టేటస్‌లను చూడొచ్చు. ఈవిధంగా స్టేటస్‌ను చూస్తే.. మీ పేరు దాన్ని చూసిన వారి కౌంట్‌లో చేరదు.
- వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి .. ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో Read Receipts అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని డిజేబుల్ చేయండి. ఇక మీరు ఇతరుల మెసేజ్ చదివినా, స్టేటస్ చూసినా .. వారికి ఆ విషయం తెలియదు.
- వాట్సాప్ స్టేటస్‌లను సీక్రెట్‌గా చూసేందుకు థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని వాడకపోవడమే బెటర్. వీటి వల్ల రిస్క్ కూడా ఎక్కువే. మీ వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే డేంజర్ ఉంటుంది.
- మీ వాట్సాప్ స్టేటస్‌ను గుర్తుతెలియని వ్యక్తులు లేదా అన్వాంటెడ్ వ్యక్తులు చూడకూడదని భావిస్తే.. కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఆ నంబర్లను డిలీట్ చేయండి. లేదా ఆ నంబర్లను (WhatsApp Status) బ్లాక్ చేసేయండి. ఇక మీ పని పూర్తయినట్టే..!
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్‌గా మారింది.