Vivo Y300 Launch: మార్కెట్ లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చిన వివో.. ధర, ఫీచర్స్ ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్విజం వివో ఇప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది.
- By Anshu Published Date - 11:02 AM, Fri - 22 November 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు విడుదలైన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లో మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తూనే ఉంది వివో సంస్థ. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..వివో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వివో వై300 ఫోన్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇచ్చింది. నవంబర్ 21 మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ స్మార్ట్‌ఫోన్ ను ఆవిష్కరించింది. వివో వై300 ప్లస్ ను చివరి నెలలో లాంచ్ చేసిన తర్వాత సిరీస్ ప్రామాణిక వేరియంట్ ధర కొంచెం తక్కువగా ఉండనుంది.
ప్లస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.23,999 ఉండగా, వివో వై300 ధర సుమారు రూ. 20వేలు గా ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్ ను కూడా కంపెనీ ధృవీకరించింది. వివో వై300 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కెమెరా లెన్స్ కి దిగువన ఉండే రింగ్ లైట్ ను కూడా కలిగి ఉంటుంది. లేకపోతే, బ్యాక్ ప్యానెల్ దిగువన బ్రాండ్ లోగోతో ఉంటుంది. ఇకపోతే వివో వై300 స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. వివో వై300 డిజైన్ లాంగ్వేజ్ ని వెల్లడించింది. వివో వై300 మెటాలిక్ ఫ్రేమ్ తో కూడిన బాక్సీ డిజైన్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్రైట్ పర్పుల్, సీ గ్రీన్ గ్రే అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ వేరియంట్ల మార్కెటింగ్ పేర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బ్యాక్ ప్యానెల్ ఆసక్తికరమైన కెమెరా వివరాలను సూచిస్తుంది. వివో వై300 మెరుగైన లో లైటింగ్ ఫోటోగ్రఫీకి ఆరా లైట్లను కలిగి ఉంటుంది.
ఇందులో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 మెయిన్ సెన్సార్, 8ఎంపీ సెకండరీ లెన్స్‌తో పాటు సెల్ఫీలకు 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14 వరకు అందించవచ్చు. ఐపీ64 వాటర్ రెసిస్టెన్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.0, స్టీరియో స్పీకర్లు, అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది.