Vivo Y300 Launch: త్వరలోనే భారత్ లోకి వివో Y300 ఫోన్.. పూర్తి వివరాలు ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో మార్కెట్లోకి మరోసారి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతోంది.
- By Anshu Published Date - 11:15 AM, Tue - 12 November 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివో సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన వివో సంస్థ త్వరలోనే భారత మార్కెట్లోకి వివో వై 300 ప్లస్ కొత్త ఫోన్ ని విడుదల చేయబోతోంది. స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీతో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలోనే ముందుకు రాబోతోంది. రాబోయే వివో వై సిరీస్ ఫోన్ కలర్‌వేస్, స్పెసిఫికేషన్ లు ఇండియా లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు లీక్ అయ్యాయి.
కాగా ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుందని తెలిపింది. వివో వై300 సోనీ ఐఎమ్ఎక్స్882 పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇతర వివరాలు ఇంకా లీక్ కానప్పటికీ, వివో వై300 ప్లస్‌పై అప్‌గ్రేడ్ లతో వివో వై300 ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వివో వై300 భారత లాంచ్ టైమ్‌లైన్, కలర్‌వేలు, స్పెసిఫికేషన్ లను షేర్ చేసింది. కాగా ఈ ఫోన్ నవంబర్ చివరి నాటికి దేశంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ టైటానియం ప్రేరేపిత డిజైన్ ను కలిగి ఉంటుంది. గ్రీన్, ఫాంటమ్ పర్పుల్, టైటానియం సిల్వర్ షేడ్స్ లో అందుబాటులో ఉంటుంది. వివో వై300 సోనీ ఐఎమ్ఎక్స్ 882 పోర్ట్రెయిట్ కెమెరా, ఏఐ ఆరా లైట్, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
కాగా వివో వై300 ప్లస్ ధర, స్పెసిఫికేషన్ ల విజయానికి వస్తే.. ప్రస్తుతం భారత మార్కెట్లో వివో వై300 ప్లస్ ధర రూ. 23,999 కు అందుబాటులో ఉంది. సింగిల్ 8జీబీ ర్యామ్, 128జీబీ మోడల్ సిల్క్ గ్రీన్, సిల్క్ బ్లాక్ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంటుంది. వివో వై300 ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్-హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీతో పాటు 8జీబీ ఎల్‌పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ తో నడుస్తుందట. ర్యామ్‌ని వర్చువల్ గా అదనంగా 8జీబీ వరకు విస్తరించవచ్చు. అయితే, మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 1టీబీ వరకు విస్తరించవచ్చట. వివో వై300 ప్లస్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుందట.