Vivo T3 Ultra: మార్కెట్లోకి మరో వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్.. అరగంట నీటిలో ముంచిన ఏం కాదట!
అద్భుతమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన వివో సంస్థ.
- By Anshu Published Date - 11:32 AM, Tue - 24 September 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే వివో నుంచి ఇటీవల టీ సిరీస్ లో భాగంగా కొత్త ఫోన్ విడుదలైన విషయం తెలిసిందే. వివో టీ3 అల్ట్రా పేరుతో కొత్త ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది. అయితే ఈ ఫోన్ వినియోగదారులు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వస్తోంది. దీనిలో మీడియా టెక్ డెమెన్సిటీ 9200 ప్లస్ చిప్ సెట్ తో వస్తోంది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమరా ఫొటో గ్రఫీ ప్రియులను మరింత ఆకర్షించనుంది.
వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్. ఇది సొగసైన, మన్నికైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఐపీ68 రేటింగ్ తో నీరు, ధూళి నిరోధకతతో వస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే..ఈ ఫోన్ 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల వరకు నీటిలో మునిగిపోయినా ఏం కాదట. స్లిమ్ ప్రొఫైల్ ను కలిగి ఉంటుందట. శక్తివంతమైన విజువల్స్ కోసం వంపు తిరిగిన 1.5కే అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్స్ ఫ్రాస్ట్ గ్రీన్, లూనార్ గ్రే లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్ టచ్ ఓఎస్ 14పై నడుస్తుంది. 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తోంది. వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్ 22 సెప్టెంబర్ నుంచి కొనుగోలు దారులకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ స్టోర్, వివిధ రిటైల్ భాగస్వాముల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 31,999 కాగా, 8జీబీ+ 256జీబీ మోడల్ ధర రూ. 33,999గా ఉంది. అలాగే 12జీబీ + 256జీబీ వేరియంట్ రూ. 35,999కి అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారులు రూ. 3,000 ఫ్లాట్ తగ్గింపును ఆస్వాదించవచ్చు. వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ తో 1.5కే అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. స్పష్టమైన ఫొటోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన ఫ్లాగ్‌షిప్ 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 921 సెన్సార్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఏఐ ఫేషియల్ ఫీచర్ తో కూడిన 50ఎంపీ ఫ్రంట్ కెమెరా మెరుగైన సెల్ఫీలను అందిస్తుంది. 80వాట్ల ఫ్లాష్ ఛార్జ్‌తో కూడిన భారీ 5,500ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.