Vivo X90: వివో నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు, ధర?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన
- By Nakshatra Published Date - 07:45 PM, Tue - 22 November 22
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అద్భుతమైన లుక్కుతో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది వివో సంస్థ. అంతేకాకుండా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. ఇది ఇలా ఉంటే వివో సంస్థ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతుంది.
వివో ఎక్స్90 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే వివో కెమెరా ఫోకస్డ్ ఎక్స్80 సిరీస్ కొనసాగింపుగా ఈ ఎక్స్90 సిరీస్ స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చారు. కాగా ఈ సీరిస్‌లో భాగంగా వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో, వివోఎక్స్90 ప్రో ప్లస్ ఇలా మూడు రకాల ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది వివో సంస్థ. ఇకపోతే ఈ వివో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.78 ఇంచెస్ అమోఎల్ఈడీ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్లు డైమెన్సిటీ 9200 చిప్ సెట్‌తో పనిచేస్తాయి.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆరిజిన్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేసే వివో ఎక్స్90 ప్రొలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా ఇవ్వనున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.. 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంను కలిగి ఉంటుంది. అలాగే 50డబ్ల్యూ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇవ్వనున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. 800 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 65,315 గా ఉంటుందని అంచనా. అయితే ధర విషయంపై ఇప్పటి వరకు అధికారంగా ప్రకటన ఇవ్వలేదు.
Related News
Poco X6 Neo: పోకో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ మాములుగా లేవుగా?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎ