Vijay Sales: విజయ్ మెగా సేల్స్.. యాపిల్ లవర్స్ త్వరపడండి
యాపిల్ గాడ్జెట్స్ లవర్స్ కి విజయ్ సేల్స్ బంపరాఫర్ ప్రకటించింది. విజయ్ సేల్స్ మెగా ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. విక్రయ సమయంలో రిటైలర్ కొత్త గాడ్జెట్లపై డిస్కౌంట్లను అందిస్తోంది.
- Author : Praveen Aluthuru
Date : 13-08-2023 - 4:40 IST
Published By : Hashtagu Telugu Desk
Vijay Sales:యాపిల్ గాడ్జెట్స్ లవర్స్ కి విజయ్ సేల్స్ బంపరాఫర్ ప్రకటించింది. విజయ్ సేల్స్ మెగా ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. విక్రయ సమయంలో రిటైలర్ కొత్త గాడ్జెట్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. దీనితో పాటు 30 మంది అదృష్ట విజేతలు యాపిల్ వాచ్ లను దక్కించుకునే అవకాశం కల్పించింది. ఈ లక్కీ డ్రాలో పాల్గొనడానికి కస్టమర్‌లు విజయ్ సేల్స్ స్టోర్‌లలో పేటీఎం ద్వారా EMIలో ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొనుగోలు దారులకు ఉచితంగా సినిమా టికెట్ ఓచర్ లభిస్తుందని ప్రకటించింది.
రూ.10000 ఫ్లాట్ తగ్గింపు ద్వారా 128GB ఫీచర్ గల యాపిల్ ఫోన్ 14 సిరీస్ రూ.69,990కి కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లతో రూ. 4,000 క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. అంతేకాకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ని విజయ్ సేల్స్ స్టోర్‌లలో ఎక్స్ ఛేంజ్ చేసుకోవాలని అనుకుంటే దాని ఎక్స్‌ఛేంజ్ విలువ రూ.15000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే విజయ్ సేల్స్ మరో రూ.8000ని జోడించి మొత్తం రూ.37,000 తగ్గింపును అందజేస్తుంది. ఐఫోన్ 14, 128GB చివరి ధర రూ. 42,900. రిటైలర్ స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు మరియు ఇయర్‌ఫోన్‌లపై 75% వరకు తగ్గింపును అందిస్తోంది.
Also Read: YSRCP : కన్నీరు పెట్టుకున్న తిరువూరు మున్సిపల్ ఛైరపర్సన్.. ఎమ్మెల్యే రక్షణనిధి తనను..?