Aadhaar Update: ఆధార్ లో వాటిని ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి డేట్ ఇదే?
భారతీయులకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. భారత దేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇటీవల
- By Nakshatra Published Date - 05:20 PM, Tue - 13 June 23
భారతీయులకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. భారత దేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇటీవల రోజుల్లో ఆధార్ కార్డు అన్నది కీలకంగా మారిపోయింది. గవర్నమెంట్ ప్రైవేట్ ఇలా ప్రతి ఒక్క పనికి ఆధార్ కార్డు అన్నది తప్పకుండా ఉండాల్సిందే. ఆధార్ కార్డు లేనిదే ఏ పని జరగడం లేదు. అయితే ఆధార్ కార్డు విషయంలో కొంతమంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పుడు సమాచారాలను నమోదు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆధార్ లో ఏవైనా అప్డేట్లను చేంజ్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కొద్దిగా డబ్బును చెల్లించాల్సిందే.
కానీ డబ్బులు లేకుండా ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు పూర్తి కానుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మార్చి 15 నుంచి ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ఇప్పటికీ అనగా 2023, జూన్ 14తో ముగియనుంది. గడువు ముగిశాక డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి.
ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే మరి ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. https://myaadhaar.uidai.gov.in/ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి, ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్డేట్ పై క్లిక్ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్ పై మీకు కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
Related News
Payments Through Aadhaar: ఆధార్ కార్డ్ ద్వారా చెల్లింపులు..? ఇది ఎలా సాధ్యమంటే..?
ఆధార్ కార్డు ద్వారా కూడా చెల్లింపులు (Payments Through Aadhaar) చేయవచ్చని మీకు తెలుసా? కొత్త అప్డేట్ ఏమి చెబుతుందో తెలుసుకుందాం.