Traffic Rules: ద్విచక్ర వాహనదారులకు జాగ్రత్త.. మారిన ట్రాఫిక్ రూల్స్!
సెప్టెంబర్ నెల మొదటి నుంచి కొన్ని నగరాల్లో కొత్త ట్రాఫిక్ రూల్స్ ని తీసుకువచ్చారు పోలీసులు.
- By Nakshatra Published Date - 12:30 PM, Tue - 3 September 24
మామూలుగా వాహన వినియోగదారులు వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని చెబుతూ ఉంటారు. అలా ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించినప్పుడు ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా రకాల ట్రాఫిక్ రూల్స్ ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సెప్టెంబర్ నెల ప్రారంభం కావడంతో ట్రాఫిక్ రూల్స్ మారిపోయాయి. మరి కొత్తగా తీసుకువచ్చిన ఆ ట్రాఫిక్ రూల్స్ ఏంటి అన్న విషయం వస్తే.. బైక్ నడుపుతున్న వ్యక్తి మాత్రమే కాకుండా వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెబుతున్నారు. లేదంటే జరిమానా విధిస్తారట.
వాహన చట్ట ప్రకారం ఇలా వాహనంలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించకపోతేజరిమానా తప్పదని సూచిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద నగరమైన విశాఖపట్నంలో నేటి నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. అయితే ఈ నిబంధన దేశ వ్యాప్తంగా గతంలో కూడా అమలు చేశారు. ఇప్పుడు వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ నడుపుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్మెట్ ధరించాల్సిందే. నగరంలో పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1035 జరిమానా విధించనున్నట్లు విశాఖపట్నం పోలీసులు తెలిపారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్ ను వచ్చే మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి.
అలాగే ఐఎస్‌ఐ గుర్తు ఉన్న హెల్మెట్‌లను మాత్రమే ధరించడం తప్పనిసరి అని, అలా చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి మార్పులు చేయవచ్చు. పిలియన్ రైడర్‌లు హెల్మెట్ ధరించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నారు. కాబట్టి ఇక మీదట వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్ ధరించడం వల్ల మీ ప్రాణాలను రక్షించుకోవచ్చు. ముందు రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠింగా మారుతున్నాయి.
Related News
Driving License: వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే తప్పులు ఇవే..!
మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తే మీరు ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా జాగ్రత్తగా నడపాలి.