Female Mosquitoes Vs Semen : రక్తం పీల్చే ఆడదోమలపైకి విష వీర్యంతో ఎటాక్.. సంచలన ప్రయోగం
విషపు ప్రోటీన్లు వీర్యంతో కలిసి ఆడదోమల(Female Mosquitoes Vs Semen) శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వాటి జీవితకాలం 37 శాతం నుంచి 64 శాతం మేర తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
- By Pasha Published Date - 06:12 PM, Wed - 8 January 25

Female Mosquitoes Vs Semen : దోమకాటు.. ప్రతిరోజూ మనం ఎదుర్కొంటున్న సమస్య. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఈ ప్రాబ్లమ్ సతమతం చేస్తుంటుంది. దీని బారి నుంచి ప్రపంచ ప్రజలను రక్షించే మార్గాలను వెతుకుతూ సైంటిస్టులు నిత్యం పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకోసం ఓ విషపు విరుగుడును ఆస్ట్రేలియాలోని మెక్ క్వేరీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. దానిలో దాగిన లోగుట్టు గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోక మానరు.
Also Read :Instant Phone Charging : రెప్పపాటులోనే ఫోన్ ఛార్జింగ్.. ‘స్విప్పిట్ హబ్’ వచ్చేసింది
మనల్ని నిత్యం కుట్టేవి.. రక్తాన్ని పీల్చేవి ఆడ దోమలే. వాటిని కంట్రోల్ చేసే మార్గాన్ని మెక్ క్వేరీ యూనివర్సిటీ సైంటిస్టులు తయారు చేశారు. దానికి సంబంధించిన వివరాలతో నేచర్ స్టడీ జర్నల్‌లో అధ్యయన నివేదిక ప్రచురితం అయింది. ఈ అధ్యయనంలో భాగంగా సైంటిస్టులు కొన్ని మగదోమల్ని ఎంపిక చేశారు. వాటిలో జన్యుపరమైన మార్పులు చేశారు. ఆ మగదోమలు వీర్యంతో పాటు విషపు ప్రొటీన్లను విసర్జించేలా జన్యు వ్యవస్థను మార్చారు. అనంతరం ఆడదోమలతో ఈ విషపూరిత మగదోమలు సంభోగం చేయగా సంచలన ఫలితాలు వచ్చాయి.
Also Read :ACB Questions : ఫార్ములా-ఈ కార్ రేసు కేసు.. ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం
విషపు ప్రోటీన్లు వీర్యంతో కలిసి ఆడదోమల(Female Mosquitoes Vs Semen) శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వాటి జీవితకాలం 37 శాతం నుంచి 64 శాతం మేర తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాధులను వ్యాపింపజేసే శక్తిని సైతం ఆయా ఆడదోమలు కోల్పోయినట్లు అధ్యయనంలో వెల్లడైంది. మనుషులు/ఇతర జీవరాశుల నుంచి రక్తం పీల్చే శక్తి సైతం ఆడదోమల్లో 40 శాతం నుంచి 60 శాతం మేర తగ్గిందని తేలింది. సాంకేతిక పరిభాషలో ఈ పద్ధతిని టీఎంటీ బయోకంట్రోల్ టెక్నాలజీ అంటారని శాస్త్రవేత్తలు వివరించారు. ఇంతకుముందు ఇదే తరహా ప్రయోగాన్ని పండ్లపై వాలే పెద్ద సైజు ఈగలపైనా చేశామని సైంటిస్టులు తెలిపారు. ఈ ప్రయోగం దోమల్లో పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే రానున్న రోజుల్లో మలేరియా, డెంగ్యూ మరణాలు ఇకపై ఉండవని ఆశాభావం వ్యక్తం చేశారు.