Instant Phone Charging : రెప్పపాటులోనే ఫోన్ ఛార్జింగ్.. ‘స్విప్పిట్ హబ్’ వచ్చేసింది
స్విప్పిట్ అనే కంపెనీ ‘స్విప్పిట్ హబ్’ పేరుతో ఇన్‌స్టాంట్ పవర్ సిస్టమ్‌ను(Instant Phone Charging) తయారు చేసింది.
- By Pasha Published Date - 04:35 PM, Wed - 8 January 25

Instant Phone Charging : స్విప్పిట్ హబ్.. హల్‌చల్ చేస్తోంది. అమెరికాలోని లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో అందరి చూపును ఆకట్టుకుంటోంది. ‘స్విప్పిట్ హబ్’ 2 సెకన్లలోనే ఫోన్‌ను ఛార్జింగ్ చేస్తుందా అంటూ అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఈ అధునాతన ఫోన్ రీఛార్జ్ టెక్నాలజీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :ACB Questions : ఫార్ములా-ఈ కార్ రేసు కేసు.. ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం
స్విప్పిట్ హబ్ విశేషాలు ఇవిగో..
- స్విప్పిట్ అనే కంపెనీ ‘స్విప్పిట్ హబ్’ పేరుతో ఇన్‌స్టాంట్ పవర్ సిస్టమ్‌ను(Instant Phone Charging) తయారు చేసింది.
- మన ఫోన్‌ను 2 సెకన్లలోనే ఛార్జింగ్ చేయడం దీని స్పెషాలిటీ.
- ఐదు పవర్ ఫుల్ బ్యాటరీలతో ‘స్విప్పిట్ హబ్’ ఉంటుంది. వాటన్నింటి నుంచి ఒకేసారి విద్యుత్ అందడం వల్ల మన ఫోన్ 2 సెకన్లలో ఛార్జ్ అవుతుంది.
- స్విప్పిట్ హబ్ ధర దాదాపు రూ.40వేల దాకా ఉంటుందని అంటున్నారు.
- అయితే స్విప్పిట్ హబ్‌తో పాటు ఇంకో పరికరాన్ని కూడా తప్పకుండా కొనాలి. అదే ‘స్విప్పిట్ లింక్’. దీని ధర దాదాపు రూ.10వేల దాకా ఉంటుంది.
- స్విప్పిట్ లింక్ అనేది ఫోన్‌ను పెట్టే ఒక హ్యాంగర్ లాంటిది. దానిలో మన ఫోను నిలబడి, స్విప్పిట్ హబ్‌లో ఉన్న బ్యాటరీల నుంచి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందుకుంటుంది.
- స్విప్పిట్ హబ్‌ను వినియోగించే వారికి స్విప్పిట్ మొబైల్ యాప్‌లోకి ఉచిత ప్రవేశం లభిస్తుంది. స్విప్పిట్ హబ్ పనితీరు ఎలా ఉంది ? దాన్ని వాడుకొని మన ఫోన్లు ఎలా ఛార్జ్ అవుతున్నాయి ? ఫోన్ ఛార్జింగ్ స్టేటస్ ఏమిటి ? అనే వివరాలన్నీ అందులో డిస్‌ప్లే అవుతుంటాయి.
- 2025 జూన్‌కల్లా ‘స్విప్పిట్ హబ్’ను అమెరికా మార్కెట్‌లో రిలీజ్ చేయాలని స్విప్పిట్ కంపెనీ భావిస్తోంది.
- ఐఓఎస్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, అన్ని ప్రధాన మోడళ్ల ఫోన్లను ‘స్విప్పిట్ హబ్’ సపోర్ట్ చేస్తుంది. అయితే తొలి విడతలో ఐఫోన్ 14, 15, 16 మోడళ్లను సపోర్ట్ చేసే ‘స్విప్పిట్ హబ్’ మాత్రమే మార్కెట్‌లోకి విడుదల కానుంది.
- తదుపరిగా ఆండ్రాయిడ్ ఫోన్లను సపోర్ట్ చేసే ‘స్విప్పిట్ హబ్’లను కూడా రిలీజ్ చేస్తారు.