HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Top 10 Best Selling Smartphones April 2022

Smart Phones : ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ లు ఇవే.?

రోజురోజుకీ టెక్నాలజీ డెవలప్ అవడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

  • Author : Anshu Date : 26-06-2022 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Download (1)
Download (1)

రోజురోజుకీ టెక్నాలజీ డెవలప్ అవడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అయితే ఇదే విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ రిసెర్చ్ నెలనెలా ప్రపంచవ్యాప్తంగా ఏ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అన్న విషయాన్ని వెల్లడిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఏప్రిల్ నెలలో ఏఏ ఫోన్ లు అధికంగా అమ్ముడయ్యాయి అన్న డేటా ని విడుదల చేసింది. కౌంటర్ పాయింట్ రిసెర్చ్ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐఫోన్ 13 సీరిస్ ఫోన్ లు ఎక్కువగా అమ్ముడయినట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫోన్ అమ్మకాలలో ప్రతి పది మందిలో ఒకరు ఈ ఐఫోన్ ని కొనుగోలు చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన టాప్‌ 10 ఫోన్‌ల జాబితాలో యాపిల్‌, శాంసంగ్‌ ఫోన్‌లు మార్కెట్‌ను శాసిస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ సంస్థకు చెందిన స్టాండడ్‌ ఐఫోన్‌లలో వనిల్లా ఐఫోన్‌ 13 అగ్రస్థానంలో నిలవగా ఏప్రిల్‌ నెలలో 5.5శాతంతో ఎక్కువగా అమ్ముడు పోయి టాప్‌లో నిలిచింది. అలాగే యాపిల్‌ ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ అత్యధికంగా అమ్ముడు పోయి 3.4 మార్కెట్‌ షేర్‌ను నమోదు చేసింది. ఆ తరువాత యాపిల్‌ ఐఫోన్‌ 13 ప్రో 1.8శాతం మార్కెట్‌ షేర్‌తో ఎక్కువగా అమ్ముడు పోయిన ఐఫోన్‌ల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఐఫోన్‌ 12 సైతం మార్కెట్‌ అమ్మకాల్లో దుమ్మురేపుతుంది.

ఏప్రిల్‌ నెలలో 1.6శాతం ఫోన్‌లు అమ్ముడుపోయి 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ 2022 1.4శాతం మార్కెట్‌ లో ఎక్కువగా అమ్ముడుపోయి ఐఫోన్‌ల జాబితాలో 5వస్థానం దక్కించుకుంది. మిగిలిన స్మార్ట్ ఫోన్ సంస్థలకు చెందిన ఏ ఫోన్ లో ఎక్కువగా అమ్ముడు పోయే అనే విషయానికి వస్తే.. 1.5శాతం మార్కెట్‌ షేర్‌తో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 ఆల్ట్రా ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. అలాగే మోస్ట్‌ అఫార్డబుల్‌ ఫోన్‌ల అమ్మకాలతో శాంసంగ్‌ గెలాక్సీ ఏ13 1.4శాతం మార్కెట్‌ను దక్కించుకుంది. అఫార్డబుల్‌ గో ఎడిషన్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఏ03 కోర్‌ ఎక్కువగా అమ్ముడు పోయి 1.4శాతం మార్కెట్‌ షేర్‌ను కైవసం చేసుకుంది. మిడ్‌ రేంజ్‌ డివైజ్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ ఫోన్‌ నిలిచింది.

1.3శాతం మార్కెట్‌తో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంది. యాపిల్‌, శాంసంగ్‌ సంస్థ మినహాయిస్తే రెడ్‌ మీ నోట్‌ 11 ఎల్‌టీఈ ఫోన్‌ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడు పోయింది. 1.3 మార్కెట్‌ షేర్‌తో యాపిల్‌, శాంసంగ్‌ ఫోన్‌లకు గట్టి పోటీ ఇచ్చింది. కాగా, ఈ ఏడాది జనవరి 26న విడుదలైన సమయంలో రెడ్‌ మీ నోట్‌ 11 ఎల్‌టీఈ ఫోన్‌ ధర రూ.12,929గా ఉంది.
ఇక చివరిగా ఏప్రిల్‌ నెలలో ఎక్కువగా అమ్ముడవుతున్న జాబితాలో 5జీ ఫోన్‌ల సంఖ్య పెరుగుతున‍్నట్లు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ వెల్లడైంది. గతేడాది 5జీ ఫోన్‌లు 4మోడళ్లు అమ్ముడుపోతే ఈ ఏడాది అనూహ్యంగా వాటి సంఖ్య 7కి చేరింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5G
  • apple
  • bsmartphone brands
  • businessusiness
  • Counterpoint Research report
  • samsung
  • smartphone brands

Related News

Good news for Apple users... Here are the brand-new features of the 18 Pro and 18 Pro Max!

iPhone 18 Pro: యాపిల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..18 ప్రో, 18 ప్రో మ్యాక్స్.. సరికొత్త ఫీచర్లు ఇవే..!

యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘iPhone 18’ మార్కెట్లోకి రావడానికి సమయం ఆసన్నమైంది. మరో రెండు నెలల్లో, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో యాపిల్ సంస్థ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన iPhone 18 Pro మరియు iPhone 18 Pro Max మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా విడుదల చేయబోతోంది. ఈ సారి లాంచ్‌లో అత్యంత ప్రత్యేకమైన ఆకర్షణ ఏమిటంటే.. యాపిల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగ

    Latest News

    • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

    • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

    • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

    • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

    • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd