WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. చిటికెలో చాట్ డేటా బదిలీ?
వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి, ఫోన్ల మధ్య వాట్సాప్ చాట్
- By Anshu Published Date - 05:30 PM, Mon - 24 June 24

వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి, ఫోన్ల మధ్య వాట్సాప్ చాట్ ను బదిలీ చేయవచ్చు. మరి ఈ కొత్త ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా మనం ఫోన్లను మారుస్తూ ఉంటాము. పాత ఫోన్ పాడైపోవడం, సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే మార్కెట్ లోకి కొత్త ఫోన్ రావడం ఇలా అనేక కారణాలతో ఈ మార్పు జరుగుతూ ఉంటుంది. కొత్త ఫోన్ తీసుకున్న ఆనందంలో ఉన్నప్పటికీ పాత ఫోన్ నుంచి చాట్ డేటాను కొత్త ఫోన్ లోకి బదిలీ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది.
ముందుగా మన డేటాను గూగుల్ డ్రైవ్ కు బదిలీ చేసి, మళ్లీ దానిని కొత్త ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలి. ఈ ప్రక్రియ వల్ల సమయం ఎక్కువ పడుతుంది. కానీ వాట్సాప్ ఇప్పుడు కొత్త గా తీసుకువచ్చిన ఫీచర్ తో ఆ ఇబ్బందులు ఉండవు. క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి చాలా సులభంగా చాట్ డేటాను బదిలీ చేసుకోవచ్చు. మరి ఇందుకోసం ఏమి చేయాలి అన్న విషయానికి వస్తే.. కొత్త పరికరంతో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పాత ఫోన్ లోని చాట్ డేటా చాలా సులువుగా బదిలీ అవుతుంది.
ఫోన్లను మార్చినప్పుడు డేటాను బ్యాకప్ చేయడానికి, పునరుద్ధరించడానికి గూగుల్ డిస్క్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొత్త క్యూఆర్ కోడ్ ఫీచర్ కు సంబంధించి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. డేటా బదిలీ సమయంలో రెండు పరికరాలను వాట్సాప్ కు లాగిన్ చేయాలా లేకపోతే క్యూఆర్ కోడ్ విధానంలో కొత్త పరికరంలో సైన్ ఇన్ మెకానిజమ్‌గా పనిచేస్తుందా అనేది అస్పష్టంగానే ఉంది.