Flying Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ బైక్ ఆవిష్కరణ..ఫీచర్స్ చూస్తే షాకవ్వాల్సిందే..!!
ప్రస్తుతం టెక్నాలజీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇంధనంతో నడిచే వెహికల్స్ అందుబాటులో ఉండగా...ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి.
- Author : hashtagu
Date : 17-09-2022 - 1:53 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం టెక్నాలజీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇంధనంతో నడిచే వెహికల్స్ అందుబాటులో ఉండగా…ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక గాల్లో నడిచేవి అంటే ఇప్పటి వరకు మనకు విమానాలు మాత్రమే తెలుసు. అయితే ఈ మధ్యే గాల్లో ఎగిరే కార్లు వచ్చాయి. ఇప్పుడు గాల్లో ఎగిరే మొట్టమొదటి బైక్ ను పరిచయం చేసింది జాపాన్ కు చెందిన స్టార్టప్ కంపెనీ. సెప్టెంబర్ 15న అమెరికాలో జరిగిన డెట్రాయిట్ ఆటో షోలో కంపెనీ తొలిఫ్లై బైక్ ను ఆవిష్కరించింది. గాలిలో ఎగిరే లగ్జరీ బైక్ లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ప్రదర్శనలో బైక్ ను చూసిన జనాలు నోరెళ్లబెట్టారు. ఈ ఫ్లై బైక్ లో ఉన్న విశేషాలేంటో తెలుసుకుందాం.
లగ్జరీ క్రూయిజర్ బైక్:
లగ్జరీ క్రూయిజర్ బైక్ ఆవిష్కరించగానే…గాల్లో ఎగురుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. XTURISMO పేరుతో ఆవిష్కరించిన ఈ బైక్ లగ్జరీ క్రూయిజర్ గా ఫేమస్ అయ్యింది. డెట్రాయిట్ ఆటో షో కో ప్రెసిడెంట్ థాడ్ స్టోట్ కూడా బైక్ ను టెస్ట్ చేసి…చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ బైక్ మీద కూర్చున్న్పపుడు చిన్న పిల్లాడిలా భావించాను. ఈ బైక్ లో ఎన్నో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. రైడర్స్ కు ఈ బైక్ మంచి ఛాయిస్ అని చెప్పారు.
AERWINS టెక్నాలజీస్:
ఈ ఫ్లైయింగ్ బైక్ తయారీదారు AERWINS టెక్నాలజీస్ వెబ్‌సైట్ ప్రకారం, బైక్ ధర $777,000. ఈ 300 కిలోల బరువతో ఎగిరే బైక్ గంటకు 100 కి.మీల వేగంతో పయణిస్తుంది. ఇది ICE ప్లస్ బ్యాటరీని కలిగి ఉంది.
This is the world's first flying bike. The XTURISMO hoverbike is capable of flying for 40 minutes and can reach speeds of up to 62 mph pic.twitter.com/ZPZSHJsmZm
— Reuters (@Reuters) September 16, 2022