WhatsApp new feature: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఫేవరెట్ కాంటాక్ట్స్ తో ఆ పని మరింత ఈజీ!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెస
- By Nakshatra Published Date - 05:35 PM, Tue - 6 February 24
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది.
కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. ఆ ఫీచర్ పేరు ఫేవరెట్ కాంటాక్ట్స్.. కాగా ఈ ఫేవరెట్ కాంటాక్ట్స్ ఫీచర్‌కి అర్థం దాని పేరులోనే ఉంది. సాధారణంగా ఫోన్ కాంటాక్ట్స్‌లో ఫేవరెట్స్, స్పీడ్ డయల్స్ వంటివి ఉంటాయి. అదే విధంగా ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌లో కూడా మనం మన ఫేవరెట్ కాంటాక్ట్స్ లిస్ట్‌ని తయారు చేసుకోవచ్చట. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉందని సమాచారం. ఈ వాట్సాప్ ఫేవరెట్ కాంటాక్ట్స్ ఫీచర్‌తో యూజర్లు తమకు ఇష్టమైన వారికి వీడియో, ఆడియో కాల్స్‌ని సులభంగా చేసుకోవచ్చు.
దీనితో కాలింగ్ ఎక్స్పీరియన్స్ మెరుగుపడుతుంది. అయితే ఈ వాట్సాప్ కొత్త ఫీచర్లో యూజర్లు.. తమ ఫేవరెట్ కాంటాక్ట్స్‌ని ఎలా క్రియేట్ చేసుకుంటారు? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ సంబంధిత కాంటాక్ట్‌ని లాంగ్ ప్రెస్ చేస్తే, దాని పక్కన ఫేవరెట్ ఆప్షన్ రావచ్చు అని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ ఫేవరెట్ కాంటాక్ట్స్‌ని ఎలా క్రియోట్ చేసుకోవాలి అనేది తెలియాలి అంటే వేచి చూడాలి మరి. కాగా ఈ వాట్సాప్ ఫేవరెట్ కాంటాక్ట్స్ ఫీచర్ యూజర్లకు బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా వందలాది కాంటాక్ట్స్ ఉన్న వారు, తమకు ఇష్టమైన వారి నెంబర్లు ఇలా ఒక గ్రూప్‌గా పెట్టుకుంటే, వెంటనే వీడియో, ఆడియో కాల్స్ చేసేందుకు పని సులభమవుతుంది. ఈ వాట్సాప్ కొత్త ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎలా పని చేస్తుంది? అన్న వివరాలపై దిగ్గజ సోషల్ మీడియా సంస్థ స్పందించాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఓ అప్డేట్ వస్తుందని అంచనాలు ఉన్నాయి.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్‌గా మారింది.