Air Travel : గుడ్ న్యూస్..పాస్ పోర్టు లేకుండా విదేశాలకు ప్రయాణం…కొత్త టెక్నాలజీని టెస్ట్ చేస్తోన్న ప్రముఖ ఎయిర్ లైన్స్..!!
- By hashtagu Published Date - 02:06 PM, Thu - 17 November 22
పక్షికి రెక్కలు ఎంత అవసరమో…మనిషి విదేశాలకు ప్రయాణం చేయాలంటే పాస్ పోర్టు అంతే అవసరం. చాలామంది విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పాస్ పోర్టు గురించి ఆలోచిస్తారు. ఒకవేళ సమయానికి పాస్ పోర్టు అందుబాటులో లేనట్లయితే…ప్రయాణం రద్దు చేసుకోవల్సిందే. కానీ ఇప్పుడు ఒకప్రముఖ ఎయిర్ లైన్స్ కంపెనీ పాస్ పోర్టు లేకుండా విదేశాలకు వెళ్లే టెక్నాలజీని టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ టెక్నాలజీ ట్రయల్ లో ఉంది.
బ్రిటిష్ ఎయిర్ వేస్ ఈ టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించింది. లండన్ ప్రయాణీకులు పాస్ పోర్టు లేకండా విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తుంది. లండన్ లోని హీత్రో ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 5లో బ్రిటిష్ ఎయిర్ వేస్ దీనికి బయోమెట్రిక్ టెక్నాలజీని టెస్ట్ చేస్తోంది. అయితే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే…లండన్ కు సంబంధించిన ప్రయాణీకులు స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ లో వారి ముఖంతోపాటు, పాస్ట్ పోర్టు, బోర్డింగ్ పాస్ లను స్కాన్ చేస్తుంది. అయితే విమానం ఎక్కే ముందు ఈ పద్దతిని ఫాలో అవుతారు.
పాస్ పోర్టు రహిత ప్రయాణం ఎలా పనిచేస్తుంది?
పాస్ట్ పోర్టు లేకుండానే టెక్నికల్ గా ప్రయాణించడం ఎలా సాధ్యం అవుతుందనే అనుమానం రావచ్చు. దీనికి సంబంధించి ఎయిర్ లైన్స్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ పోర్టు టెర్నినల్ లో స్మార్ట్ బయో పాడ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. దీంతో ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రయాణికులు కేవలం మూడు సెకన్లలోపే వెరిఫై చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రయాణీకుడికి పాస్ పోర్టుతో సంబంధం ఉండదు. కావాలనుకుంటే పాస్ పోర్టు వెంట పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని చూపించవచ్చు. అయితే లండన్ ప్రయాణీకులు తమ బయోమెట్రిక్ డేటాను ఇంటి నుంచే రికార్డ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
ఈ స్మార్ట్ టెక్నాలజీతో వినియోగదారలు మరిన్ని మెరుగైన అనుభవాన్ని పొందుతారని కంపనీ వెల్లడించింది. దీంతో ప్రయాణీకులు ఎయిర్ పోర్టులో గంటలతరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదని..ఈ టెక్నాలజీ ద్వారా సమయం తగ్గుతుందని తెలిపింది. సాధ్యమైనంత వరకు ఉత్తమ కస్టమర్ సేవను అందించేందుకే ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ బయోమెట్రిక్ పాస్ పోర్టు వెరిఫికేషన్ ట్రయల్ 6నెలల పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం లండన్ నుంచి స్పెయిన్ వెళ్లే ప్రయాణికులు ఈ స్మార్ట్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నారు.
Related News
London: విమానంలో నిద్రలోనే మరణించిన వృద్ధురాలు
మరణం ఎప్పుడు ఎలా వస్తుందో అంచనా వేయడం అసాధ్యం. అలాగే మరణం నుంచి తప్పించుకోలేము. అయితే అకాల మరణం నిద్రలోనే వస్తుందంటారు. తాజాగా విమానంలో ప్రయాణిస్తున్న 73 ఏళ్ళ వృద్ధురాలు నిద్రలోనే శ్వాస విడిచింది.