Smart Phone: మీ స్మార్ట్ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా.. అయితే ఇలా చేయాల్సిందే?
స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవుతుంది అనుకున్న వాళ్ళు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే ఫోన్ పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:03 AM, Wed - 14 August 24

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లో కనీసం నాలుగైదు స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. కొన్ని పెద్ద పెద్ద ఫ్యామిలీలలో అయితే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. కాలంతో పాటు టెక్నాలజీ కూడా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ని అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమంది స్మార్ట్ ఫోన్ ని జాగ్రత్తగా చూసుకుంటే మరికొందరు మాత్రం ఏవేవో పిచ్చిపిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేసి అనవసరంగా ఫోన్ పనితీరును దెబ్బతీసే విధంగా చేస్తూ ఉంటారు.
అందుకే మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఫోన్ హ్యాంగ్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. స్మార్ట్ ఫోన్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే దాని పనితీరు వేగవంతంగా, మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది. మరి ఫోన్ పనితీరు తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్మార్ట్ ఫోన్లలో అనవసర యాప్‌లు ఉంటాయి. అవి మనకు ఉపయోగపడవు. పైగా స్పేస్ ను ఆక్రమిస్తాయి. కాబట్టి స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతున్న వాళ్ళు స్లో గా ఉంది అనుకున్న వాళ్లు ఇలాంటి యాప్ లను తొలగించాలి. దీని వల్ల ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే యాప్ లు చాలా నిల్వను ఆక్రమిస్తాయి. అవసరమైనవి ఉంటే తప్పనిసరిగా ఉపయోగించాలి.
ఫోన్ పనితీరులో ఎలాంటి మార్పు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా దానిలోని యాప్ లు, ఆపరేటింగ్ సిస్టమ్ ను ఎప్పటి కప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాలి. తాజా ఆపరేటింగ్ సిస్టమ్ తో పరికరాన్ని ఉపయోగించడం వల్ల ఫోన్ వేగంగా పని చేస్తుంది. తద్వారా మీ పనులు చాలా సులువుగా జరుగుతాయి. అలాగే అనవసర యాప్ లతో పాటు బోట్ వేర్ యాప్ లను కూడా ఫోన్ నుంచి అన్ ఇన్ స్టాల్ చేయాలి. అలా చేస్తే మీ ఫోన్ పనితీరు వేగంగా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ లోని చాలా నిల్వను బోట్ వేర్ ఆక్రమిస్తుంది. ఫోన్ పనితీరుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కాబట్టి పనితీరును మెరుగుపర్చుకోవడానికి తప్పనిసరిగా బోట్ వేర్ ను తొలగించాలి. సాధారణంగా ఫోన్ ను ప్రతి ఒక్కరూ చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల మనకు తెలియకుండానే కాష్ పెరిగిపోతుంది. కాబట్టి రోజుకు ఒక్క ఐదు నిమిషాలు కేటాయించి మీ ఫోన్ లేదా టాబ్లెట్ లోని కాష్ ను ఎప్పటి కప్పుడు తొలగించాలి. దీని వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముందుగా ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది. మల్టీ టాస్కింగ్ సమయంలో ఎటువంటి సమస్య ఉండదు.