Self-Cleaning Touch Screen: సెల్ఫ్ క్లీనింగ్ టచ్ స్క్రీన్ వస్తున్నాయి.. జనరల్ మోటార్స్ కి పేటెంట్
సెల్ఫ్ క్లీనింగ్ LED టచ్ స్క్రీన్స్ రాబోతున్నాయి. మొబైల్స్, ల్యాప్ టాప్స్ టచ్ స్క్రీన్స్ ను మీరు ఇక క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు.
- By Maheswara Rao Nadella Published Date - 12:00 PM, Sun - 5 March 23

సెల్ఫ్ క్లీనింగ్ (Self-Cleaning) LED టచ్ స్క్రీన్స్ రాబోతున్నాయి. మొబైల్స్, ల్యాప్ టాప్స్ టచ్ స్క్రీన్స్ ను మీరు ఇక క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీ వీటిని అభివృద్ధి చేసింది. వీటిపై పేటెంట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.GMకి పేటెంట్ నంబర్ US 11,579,340 B2 లభించింది.
ఇలా పనిచేస్తుంది?
ఈ అడ్వాన్స్డ్ టచ్ స్క్రీన్ ను ఒక ఫోటో క్యాటలిటిక్ కోటింగ్ మెటీరియల్ తో తయారు చేశారు. ఉపరితలం పై ఉండే నీటిని ఆవిరి గా మార్చేసే మెకానిజం దాని సొంతం. ఈ LED టచ్ స్క్రీన్ పై కొంచెం ఎండ పడగానే .. దానిలో ఉన్న ఫోటో క్యాటలిటిక్ కోటింగ్ మెటీరియల్ స్పందిస్తుంది. అది ఒక హైడ్రో ఫిలిక్ లాగా ప్రవర్తించి గాలిలో ని తేమను తనలోకి లాగుతుంది. ఈ ప్రక్రియ జరిగే క్రమంలో టచ్ స్క్రీన్ ఉపరితలం పై ఉండే ఘన పదార్థాలు, వేలిముద్రల గుర్తులు, ఇతర మరకలు తొలగిపోతాయి. ఫలితంగా టచ్ స్క్రీన్ మరక లేకుండా నీట్ గా మారుతుంది. ఇప్పటికే సోలార్ ప్యానెల్స్ సెల్ఫ్ క్లీనింగ్ (Self-Cleaning) ఇదే తరహా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. భవిష్యత్ లో మొబైల్స్, ల్యాప్ ట్యాప్స్, కంప్యూటర్లు, కార్లలోని స్క్రీన్స్ గృహాలు, వాహనాలకు వినియోగించే అద్దాలలోనూ ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావచ్చు.ఆసుపత్రులలోని వైద్య పరికరాలపై ఇలాంటి టచ్ స్క్రీన్‌లను వాడడం చాలా బెస్ట్.దీనివల్ల రోగులు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాధులు సంక్రమించే ముప్పు తగ్గుతుంది.
టచ్ స్క్రీన్ అంటే..
టచ్ స్క్రీన్ అనేది డిస్‌ప్లే పరికరం. ఇది వినియోగదారులు వారి వేలు లేదా స్టైలస్‌ని ఉపయోగించి కంప్యూటర్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది . అవి GUI (గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్)ని నావిగేట్ చేయడానికి మౌస్ లేదా కీబోర్డ్‌కి ఉపయోగ కరమైన ప్రత్యామ్నాయం. కంప్యూటర్ మరియు ల్యాప్‌టాప్ డిస్‌ప్లేలు, స్మార్ట్‌ఫోన్‌లు , టాబ్లెట్‌లు , నగదు రిజిస్టర్‌లు, ఇన్ఫర్మేషన్ కియోస్క్‌లు వంటి వివిధ పరికరాలలో టచ్ స్క్రీన్‌లు ఉపయోగించబడతాయి . కొన్ని టచ్ స్క్రీన్‌లు టచ్-సెన్సిటివ్ ఇన్‌పుట్‌ను ఉపయోగించకుండా వేలు ఉనికిని పసిగట్టడానికి ఇన్‌ఫ్రారెడ్ కిరణాల గ్రిడ్‌ను ఉపయోగిస్తాయి.
Also Read: Shane Warne: షేన్ వార్న్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్

Related News

Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం
సంక్షేమం , అభివృద్ధి ప్లస్ అసమానతల సంస్కరణ వెరసి విజన్ 2047 గా తెలుగు వాళ్లకు పిలుపునిచ్చారు. వందేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు జాతి ముందు వరుసలో ఉండాలని..