Samsung Galaxy: సాంసంగ్ స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్లు.. ఆ బంపర్ ఆఫర్ తో తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా!
సాంసంగ్ హాలిడే సేల్ ఆఫర్ లో భాగంగా సాంసంగ్ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు.
- By Anshu Published Date - 11:32 AM, Mon - 23 December 24

సాంసంగ్ హాలిడే సేల్ ఆఫర్ లో భాగంగా ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్24 సిరీస్, Z ఫోల్డ్ 6, Z ఫ్లిప్ 6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లను ఆకర్షణీయమైన తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ మీరు సాంసంగ్ ఎస్ 23 FE స్మార్ట్ ఫోన్ ను రూ. 29,999కి కొనుగోలు చేసే అవకాశం ఉంది. సాంసంగ్ Galaxy S23 బేస్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ తో రూ. 38,999కి వస్తుంది. గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా రూ. 72,999 కి అందుబాటులో ఉంటుంది. సాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ పై కూడా తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. గెలాక్సీ ఎస్24 ధర రూ.62,999, గెలాక్సీ ఎస్24 ప్లస్ రూ.64,999, గెలాక్సీ ఎస్24 అల్ట్రా రూ.1,09,999 ఉంది.
ఈ ధరలు గెలాక్సీ ఎస్ 24 ప్లస్, గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 256జీబీ వెర్షన్ లకు సంబంధించినవి. గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా రూ. 8,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ రూ. 12,000 అదనపు అప్‌గ్రేడ్ బోనస్ ను పొందుతుంది. మీరు ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే, రూ. 12,000 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంటుంది. గెలాక్సీ ఎస్ సిరీస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ లతో పాటుగా, ఫోల్డింగ్ ఫోన్ లు కూడా తగ్గింపుతో లభిస్తాయి. కొన్ని నెలల క్రితం విడుదల చేసిన గెలాక్సీ Z ఫోల్డ్ 6, Z ఫ్లిప్ 6లను పరిమిత కాల ఆఫర్ కింద వరుసగా రూ. 1,44,999, రూ.89,999కి 24 నెలల ఈఎంఐ ఆఫర్ తో కొనుగోలు చేయవచ్చు.
ఈ ఈఎంఐ ఆఫర్‌లు సాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6, Z ఫోల్డ్ 6 కోసం వరుసగా రూ. 2,500, రూ. 4,028 నుండి ప్రారంభమవుతాయి. మీరు గెలాక్సీ ఎస్ 24 FE 256జీబీ వెర్షన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఈ ఫోన్ రూ. 60,999కి అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ఆఫర్లో భాగంగా సాంసంగ్ స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సాంసంగ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి కొత్త ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వారికి ఇది సరైన సమయం అని చెప్పాలి.