Samsung Galaxy M13: తక్కువ దొరికే శామ్సంగ్ ఎం13 సిరీస్ 5జీ,4జీ ఫోన్స్.. ధర ఎంతో తెలుసా?
శామ్సంగ్ కంపెనీ మొబైల్ లను ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. అదేమిటంటే ఉత్తర కొరియాకు చెందిన అగ్రశ్రేణి కంపెనీ
- By Nakshatra Published Date - 09:15 AM, Fri - 15 July 22
శామ్సంగ్ కంపెనీ మొబైల్ లను ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. అదేమిటంటే ఉత్తర కొరియాకు చెందిన అగ్రశ్రేణి కంపెనీ భారత విపణిలోకి తక్కువ ధరలోనే ఎం13 సిరీస్ ఫోన్ లను ప్రవేశపెట్టింది. 4జీ తో పాటుగా త్వరలోనే రానున్న 5జి సేవలను కూడా సపోర్ట్ చేసే విధంగా స్మార్ట్ ఫోన్ లను శామ్సంగ్ తీసుకొచ్చింది. 4జీ, 5జీ వెర్షన్ లలో ఫీచర్లు భిన్నంగా ఉన్నాయి. అంతే కాకుండా వీటి ధరలు చాలా తక్కువ ధర నుంచే ప్రారంభమవుతున్నాయి.
ఈ మొబైల్ ఫోన్ ధరల విషయానికి వస్తే.శామ్సంగ్ గెలాక్సీ ఎం13 4జీలో 4జీబీ ర్యామ్, 64జీబీ ధర రూ.11,999. అలాగే, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.13,999 కాగా ఎం 13 5జీలో 4జీజీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.13,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.15,999. ఈ మొబైల్ ఫోన్ లు నైట్ బ్లూ, ఆక్వా గ్రీన్, స్టార్ డస్ట్ బ్రౌన్ రంగుల్లో ఇవి లభిస్తున్నాయి. అలాగే ఈ మొబైల్ ఫోన్లలో టీచర్ల విషయానికొస్తే..4జీ వేరియంట్ లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే, శామ్సంగ్ సొంత ప్రాసెసర్ అయిన ఎక్సినోస్ 850 ఉంటుంది.
వర్చువల్ గా ర్యామ్ విస్తరించుకునే ఆప్షన్ ఉంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. వెనుక భాగంలో 50 పిక్సల్ ప్రధాన కెమెరా, ముందు భాగంలో 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేశారు. 5జీ వేరియంట్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ఎస్ వోసీ చిప్ తో వస్తుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జర్ సదుపాయం ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగా పిక్సల్ సహా రెండు కెమెరాలు, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు.
Tags
Related News
Free Screen Replacement : ఆ ఫోన్లు వాడుతున్నారా ? ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్
Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ? అయితే మీకే ఈ శుభవార్త.