Redmi 14C 5G: అతి తక్కువ ధరకే రెడ్ మీ 5జీ స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలు ఇవే!
తక్కువ ధరకే మంచి 5 జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి రెడ్ మీ సంస్థ తాజాగా ఒక చక్కటి శుభవార్తను తెలిపింది.
- By Anshu Published Date - 11:03 AM, Fri - 10 January 25

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్ మీ 14సీ 5జీ స్మార్ట్ ఫోన్ ఇండియాలోకి విడుదల చేసింది. కాగా తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఇది రూ. 9,999 గా ఉంది. 4జీబీ రామ్ + 64జీబీ ఇంటర్నల్ తో ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అయినా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి స్టోర్లలో రేపటి నుంచి అనగా జనవరి 10 నుంచి అందుబాటులో ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్, స్టార్‌లైట్ బ్లూ కలర్ వేరియంట్ లలో లభిస్తుంది. అలాగే ఇది డ్యూయల్ 5జీ సిమ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ 6.88 అంగుళాల HD + డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 600 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ సిస్టమ్ ఆన్ చిప్‌తో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా షావోమి హైపర్ OSలో నడుస్తుంది. ఇది నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్ ఉంటుంది. దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం ఐపీ 52 రేటింగ్ పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ రామ్ + 64జీబీ స్టోరేజ్, 6జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా ఫీచర్ల విషయానికొస్తే..
రెడీ మీ 14సీ 5జీ లో ప్రధాన కెమెరా 50 మెగా పిక్సెల్స్. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ కెమెరా అందించింది. ఫోన్ లో నైట్, హెచ్‌డిఆర్ మోడ్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా 5160 mAh బ్యాటరీని ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ కోసం USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే, స్మార్ట్‌ఫోన్ తో బాక్స్ లో 33వాట్స్ ఛార్జర్ అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ల ధరల విషయానికొస్తే.. 4జీబీ RAర్యామ్ 64జీబీ స్టోరేజ్ ధర రూ.9,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.10,999 గా ఉంది. 6జీబీ రామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.11,999 గా ఉంది. స్మార్ట్‌ఫోన్ లో స్పీకర్లు, హెడ్‌ఫోన్ లను కనెక్ట్ చేయడానికి జాక్, వేగవంతమైన ఇంటర్నెట్ కోసం డ్యూయల్ బ్యాండ్ వై ఫై, బ్లూటూత్ 5.0, ఫింగర్ ప్రింట్ స్కానర్, A4 వంటి వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ ను కూడా కలిగి ఉంది.