Realme: తక్కువ ధరకే రియల్ మీ సిసి 33.. అద్భుతమైన ఫీచర్ లతో?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీల సంస్థ రియల్ మీ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల అద్భుతమైన ఫ్యూచర్లతో, మొబైల్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే.
- By Anshu Published Date - 10:45 AM, Thu - 8 September 22
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీల సంస్థ రియల్ మీ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల అద్భుతమైన ఫ్యూచర్లతో, మొబైల్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే వినియోగదారుల అభిరుచి ల మేరకు ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్ లను భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. రియల్ మీ తక్కువ ధరకే సీ33 4జీ స్మార్ట్ ఫోన్ ను తాజాగా ఆవిష్కరించింది. ఇక ఈ ఫోన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే, యూనిసాక్ టీ 612 ప్రాసెసర్ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ 3జీబీ, 32జీబీ, 4జీబీ, 64జీబీ వెర్షన్ లలో కూడా లభిస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. ఈ మొబైల్ వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా వున్నాయి. అందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా,ఇక ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా వున్నాయి. ఇంటర్నల్ స్టోరేజీని ఒక టీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జర్ తో లభిస్తుంది.
ఇక 3జీబీ ర్యామ్ వెర్షన్ ధర రూ.8.999 కాగా 4జీబీ ర్యామ్ ధర రూ.9,999. ఈ మొబైల్ ఫోన్ లు ఆక్వా బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో లభిస్తున్నాయి. కాగా ఈ ఫోన్ సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలు జరగనున్నాయి. అయితే ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు కార్డుపై కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు కూడా లభిస్తుంది.