Realme 13 vs Realme 12: రియల్ మీ 13, రియల్ మీ 12 ఫోన్ల మధ్య తేడా తేడాలు ఇవే?
రియల్ మీ 13, రియల్ మీ 12 ఫోన్ల మధ్య ఉన్న తేడాల గురించి వివరించారు.
- By Anshu Published Date - 01:00 PM, Sun - 1 September 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ ఇప్పటికే మార్కెట్లోకి అనేక రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటిలో రియల్ మీ 12, రియల్ మీ 13 ఫోన్లు కూడా ఒకటి. అయితే రియల్మీ 12 సిరీస్ తర్వాత మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో రియల్మీ 13 సిరీస్ ఈ వారం లాంచ్ అయిన విషయం తెలిసిందే. అయితే చాలామందికి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలియక ఏది కొనుగోలు చేయాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య ఉన్న తేడాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రియల్మీ 13, రియల్మీ 12 ఒకే రకమైన డిజైన్ కాన్సెప్ట్ ను కలిగి ఉన్నాయి.
అయితే రియల్మీ 13 బ్యాక్ ప్యానెల్ పై టెక్స్చర్ కలిగి ఉన్న డ్యూయెల్ టోన్ డిజైన్ తో వస్తుంది. డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ రేటింగ్ ప్రొటెక్షన్ ను ఐపీ54 నుంచి ఐపీ64కు అప్‌గ్రేడ్ చేశారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72 ఇంచ్ ఫుల్హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అందిస్తున్నాయి. అందువల్ల, రెండు ఒకే విధమైన డిస్ప్లే టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఒక అనుభవాన్ని ఇస్తాయి. కెమెరా పరంగా, అనేక మార్పులు జరిగాయి. మెగా పిక్సల్ విషయానికి వస్తే.. రియల్మీ 13 డౌన్‌గ్రేడ్స్ ఎదుర్కొంది. రియల్మీ 13లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ ఉండగా, రియల్మీ 12లో 108 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. అయితే, కొత్త తరంతో, మీరు ఓఐఎస్ సపోర్ట్1440పీ వీడియో క్వాలిటీని పొందవచ్చు. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో 2 మెగా పిక్సెల్ బోకే కెమెరా ఉంది.
అయితే రియల్మీ 13లో సెల్ఫీ కెమెరాను 8 ఎంపీ నుంచి 16 ఎంపీకి అప్‌గ్రేడ్ చేశారు. పనితీరు కోణంలో, రియల్మీ 13 8 జీబీ ర్యామ్‌తో కనెక్ట్ చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసితో పనిచేస్తుంది. మరోవైపు, రియల్మీ 12లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో పాటు 6 జీబీ ర్యామ్ ఉంది. అందువల్ల, రియల్మీ ప్రాసెసర్, ర్యామ్ పరంగా గణనీయమైన పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్స్ ఇంటిగ్రేట్ చేసింది. బ్యాటరీ పరంగా, రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో 45 వాట్ విఓఓసి ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటాయి. ఇప్పుడు ధరల కోణంలో చూస్తే, రియల్మీ ధరను రూ.1000 పెంచింది. కాబట్టి రియల్మీ 13 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.17,999గా ఉంది. రియల్మీ 12 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది.